ప్రభుత్వ అధికారిక సమాచారం ఏదో ఐటీ గ్రిడ్ కంపెనీ చోరీ చేసిందన్నట్లుగా.. హడావుడి చేసిన… సైబరాబాద్ పోలీసులు మొత్తానికి “సేవా మిత్ర” అనే యాప్లో సున్నితమైన సమాచారం ఉందని.. అది ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామనే కంక్లూజన్ అధికారికంగా ఇచ్చారు. అంటే.. మొత్తం వ్యవహారం అంతా.. యాప్ చుట్టూనే తిరిగింది. యాప్లో అనధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందా..? అంటే… సాంకేతిక నిపుణులు దాదాపు అసాధ్యం అనే చెబుతున్నారు. అందులో ఉన్న సమాచారం అనధికారికంగా.. అక్రమంగా వచ్చిందని నిరూపించడానికి చాన్సే ఉండదంటున్నారు. అది ఎలాగో చూద్దాం..!
మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు… ఆ యాప్.. కొన్ని పర్మిషన్లు అడుగుగుతుంది. కాంటాక్ట్స్, లోకేషన్, ఫోటోస్, కాలింగ్.. ఇలా. ఆ యాప్ యూసేజ్ని బట్టి ఎక్కువగా పర్మిషన్లు అడుగుతూ ఉంటాయి. యూజర్.. వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాడుకోగలరు. లేకపోతే లేదు. యాక్సెప్ట్ చేయడం అంటే.. స్వచ్చందంగా.. తమ సమాచారాన్ని ఇవ్వడానికి అంగీకరించినట్లే. దాన్ని ఎక్కడా చాలెంజ్ చేయడానికి లేదు. ఇప్పుడు సేవామిత్ర అనే యాప్ కూడా ఈ కోవలోకే వస్తుంది. పైగా.. ఈ యాప్.. పబ్లిక్ యూసేజ్కు సంబంధించినది కాదు. పూర్తిగా.. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించినది. అందులో.. టీడీపీ కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటిలు.. పార్టీ వ్యూహాలు, సంక్షేమ నిధి ఇలాంటి వివరాలు ఉంటాయి. ఎవరి స్థాయిల్లో వారికి యాక్సెస్ ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవాలంటే.. ఓ రసీదు బుక్లో వంద రూపాయలు కడితే ఇవ్వరు. ఫేక్ సభ్యత్వాలు లేకుండా… అన్ని వివరాలు అడుగుతారు. అందులో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు కూడా అడుగుతారు. అలాగే కలర్ ఫోటో తీసుకుంటారు. ఆన్లైన్లో సొంతంగా అప్లయ్ చేసుకుంటే.. ఈ మొత్తం వివరాలతో పాటు స్కాన్ చేసిన.. ఫోటోను అప్ లోడ్ చేయాలి. పార్టీ ప్రతినిధి వచ్చి సభ్యత్వం నమోదు చేయించుకున్నా… ఇవన్నీ ఉండాలి. పార్టీ ప్రతినిధి ఫోటో తీసుకుంటారు. ఇలా.. టీడీపీకి అరవై లక్షల మంది సభ్యత్వం ఉంది. క్రియాశీల సభ్యులు, వివిధ కమిటీల సభ్యులకు ఈ యాప్లో యాక్సెస్ ఉంటుంది. బూత్ కమిటీలకు ప్రత్యేకంగా కొన్ని విధులను..యాప్ ద్వారా నిర్దేశిస్తారు. అంటే.. ఎలా చూసినా..ఇందులోకి వచ్చే ఓటర్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ఫోటోలు అన్నీ స్వచ్చందంగా ఇచ్చేవే. కాబట్టి నేరం అని చెప్పడానికి అవకాశం లేదు. ఇక యాప్లో .. లబ్దిదారుల వివరాలు ఉన్నాయని… సైబరాబాద్ కమిషనర్ చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ.. టీడీపీ తరపున సర్వేల్ని కూడా.. చేస్తున్నారు. ఇలా సర్వేలు చేస్తున్న సమయంలో… ప్రశ్నాజవాబుల ద్వారా వివరాలు సేకరిస్తుంది. వాటిని ఆటోమేటిక్గా డీకోడ్ చేస్తుంది. ఈ వివరాలన్నీ సర్వేలు చేసినప్పుడు స్వచ్చందంగా చెప్పేవే. ఇదే నేరమైతే.. అన్ని పార్టీలు సర్వేలు చేసుకుంటాయి కదా..!
ఈ మొత్తం వ్యవహారంలో.. సేవామిత్ర యాప్లో ఉన్న సమాచారాన్ని సేకరించడానికి మాత్రం.. అక్రమ డాటా ఉందన్న కారణాన్ని చూపి ఆ సంస్థపై పోలీసులు దాడి చేశారు. కావాల్సిన వివరాలను పట్టుకుపోయారు. ఆ వివరాలు వైసీపీకి చేరాయా.. టీఆర్ఎస్ ఆఫీసుకి చేరాయా అన్నది తేలాల్సి ఉంది. మామూలుగా అయితే.. సేవామిత్రలో ఉన్న సమాచారం అంతా స్వచ్చందంగా ఉన్న విషయంపై సులువుగా ఏ కొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికైనా అర్థం అయిపోతుంది.