అసలు నేరం జరిగిందో లేదో తెలియదు. కానీ కేసు పెట్టేశారు. కేసు పెట్టేసి.. నేరం జరిగిందని నిరూపించడానికి సోదాలు చేశారు. అందులో కూడా ఏమీ దొరకలేదు. ఆ విషయం కూడా.. పోలీసులే క్లారిటీ ఇచ్చారు. అక్రమంగా అదుపులోకి తీసుకుని.. హైకోర్టు చేత చీవాట్లు తిన్న విడిచి పెట్టాల్సి వచ్చిన నలుగురు ఉద్యోగుల దగ్గర మాత్రం… స్టేట్మెంట్లు తీసుకుని.. ఆ యాప్‌లో.. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలున్నాయంటూ.. ప్రకటించేశారు సజ్జనార్. అవి దుర్వినియోగం అయినట్లు సమాచారం లేదన్నారు. ఈ వివరాలను బట్టి చూస్తే.. అసలు ఇందులో నేరమేమిటో ఎవరికీ తెలియదు.
వామ్మో..సజ్జనార్.. లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తారట..!
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ కేసు విషయంలో.. అడుగు ముందుకు వేయలేదు కానీ.. అరెస్టుల వరకూ వెళ్లిపోయారు. ఎంతటి వాళ్లనైనా అరెస్ట్ చేస్తామన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. చంద్రబాబునైనా అరెస్ట్ చేస్తామన్నట్లుగా.. వెటకారంగా సమాధానం ఇచ్చేశారు. ఆ కేసు స్థాయికి.. సజ్జనార్ మాటలు చూసి.. ఇంత కాలంగా.. క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులే.. ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కొంత మంది జర్నలిస్టులు.. కొన్ని సెక్షన్లు ప్రత్యేకంగా ప్రస్తావించి… అసలు ఇది ఏపీ కేసు.. తెలంగాణలో ఎలా విచారిస్తారు అని ప్రశ్నిస్తే.. చాలా కింది స్థాయి పోలీసు అధికారి తెలివి తేటల్ని ప్రదర్శిస్తూ… దొంగతనం ఇక్కడే జరిగింది కాబట్టి.. ఇక్కడే కేసు అని చెప్పుకొచ్చారు.
డేటా ఏమైనా రూపాయి బిళ్లా.. హైదరాబాద్‌లో దొంగతనం చేయడానికి..!
డేటా అనేది.. ఫిజికల్‌గా ఉంటుందా..? కేటీఆర్ చెప్పినట్లు… ఆ వైసీపీ విజిల్ బ్లోయర్… ఏపీ నుచి వచ్చి.. ఆ డేటాను పర్సులో పెట్టుకుని వచ్చి.. ఆ ఐటీ గ్రిడ్ కంపెనీ ముందు పోగొట్టుకున్నారా..? . అక్కడ పోగొట్టుకుని ఐటీ గ్రిడ్ కంపెనీ వాళ్లు దొంగిలించారని కేసు పెట్టారా..?. డేటా అనేది.. ఎక్కడ.. ఉంటుందో.. అక్కడ నుంచి దొంగిలిస్తారు. అక్కడే కేసు అవుతుంది. అదీ ఏపీ ప్రభుత్వానిది. ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉంటుంది. ఆ మాత్రం.. కామన్సెన్స్.. లేనట్లు కమిషనర్ సజ్జనార్ సమాధానానాలు చెప్పడం.. .జర్నలిస్టులందరికీ.., మైండ్ బ్లోయింగ్ అయిపోయినట్లయింది. దానికి తోడు.. అరెస్టులనే హెచ్చరికలు. ఆధారాలు లేని కేసులో.. కోర్టు మొట్టికాయలు వేస్తే.. ఏం చేస్తారో కానీ.. ముందుగానే.. రాజకీయ నేతల్ని మించి … సజ్జనార్ రెచ్చిపోయారు. ఉదయం తెలంగాణ భవన్లో.. కేటీఆర్ ఏం మాట్లాడారో.. అచ్చంగా.. ప్రెస్‌మీట్‌లోనూ సజ్జనార్ అదే చెప్పుకొచ్చారు. అసలు ఎవరు ఫిర్యాదు చేశారు..? వారికేమీ సంబంధం..? అనే వాటికి.. సజ్జనార్ క్లారిటీ ఇవ్వలేకపోయారు.
మర్డర్లు చేస్తే ఎలా తప్పించుకోవాలో చెప్పే పోలీసులున్న డిపార్ట్మెంట్ మరి..!
ఓ వైపు పోలీసులు… కాంట్రాక్టు మర్డర్లు చేసే వారికి.. ఎలా .. తప్పించుకోవాలో సలహాలిస్తూ బుక్కయిపోతున్నారు. వడ్డీ వ్యాపారాలతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన కరుడు గట్టిన ఖాకీలున్న డిపార్టుమెంట్..వాళ్లందరూ.. తాత్కాలికంగా సస్పెండ్ అయినా.. హాయిగా ఉన్నారు. డ్రగ్ర్స్ కేసు దగ్గర్నుంచి నయీం కేసు వరకూ.. ఒక్కటీ తేలదు. కానీ.. ఇలాంటి అర్థంపర్థం లేని రాజకీయ టార్గెట్ కేసుల్లో మాత్రం.. తెలంగాణ పోలీసులు.. టీఆర్ఎస్ నేతల్ని మించి స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఖాకీ దుస్తులకు విలువ లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పట్లో ప్రమోషన్ల కోసం పోలీసులు ఎన్కౌంటర్లు చేసేవారు. ఇప్పుడా అవకాశం లేదు కాబట్టి.. పొలిటికల్ ఎన్ కౌంటర్లు చేసుకుని అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.