సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. నేడో, రేపో నోటిఫికేషన్ రావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ… అభ్యర్థుల ఎంపికలో తలమునకలు అయ్యాయి. వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. టీడీపీ తరపున చంద్రబాబు అదే పనిలో రోజంతా ఉంటున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో… దరఖాస్తులు తీసుకుంది. వాటిని స్క్రీనింగ్ చేసి ఢిల్లీకి పంపింది. జనసేన పార్టీ అధినేత కూడా.. చాలా రోజుల పాటు.. దరఖాస్తులు తీసుకున్నారు. వాటి నుంచి సమర్థులైన అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన టీం కసరత్తు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో.. ఒక్క బీజేపీ మాత్రమే సైలెంట్‌గా ఉంటుంది. ఆ పార్టీ అసలు అభ్యర్థుల గురించి అసలు పట్టించుకోవడం లేదు.
బీజేపీ జాతీయ పార్టీ. సహజంగానే… టిక్కెట్ల ఖరారు ఢిల్లీలో ఉంటుంది. అభ్యర్థుల ఖరారుకు.. ఓ టైమ్ లైన్ పెట్టుకుంటారు. ఆ ప్రకారం.. అమిత్ షా ఇప్పటికే.. అన్ని రాష్ట్రాల సమాచారన్ని తెప్పించుకుని అభ్యర్థుల జాబితాకు ఓ రూపు ఇచ్చారని చెబుతున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత.. పోలింగ్ తేదీలను బట్టి విడుదల చేయడమే మిగిలిందంటున్నారు. అయితే.. ఏపీ లాంటి రాష్ట్రాల నుంచి మాత్రం ఇంత వరకూ దరఖాస్తులు కోరినట్లుగా కూడా.. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు.. టిక్కెట్ల విషయంలో ఏమైనా కసరత్తు చేస్తున్నారా.. అన్నదానిపైనా… బీజేపీ నేతలకు క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు వచ్చే సూచనలు లేకపోవడంతో.. వారు కూడా.. ఆ కసరత్తేదో జరగకపోతే బాగుండని అనుకుంటున్నారు.
బీజేపీకి చాలా పెద్ద నేతలు ఉన్నారు. కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాడు, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, మాణిక్యాలరావు ఇలా.. చాలా మంది ఉన్నారు. వీరి హడావుడి మామూలుగా ఉండదు. 2014కి ముందు.. కన్నా… కాంగ్రెస్‌లో మంత్రిగా చేశారు కాబట్టి ప్రముఖుడిగా అనుకోవచ్చు. మిగిలిన వాళ్లెవరికీ పెద్దగా పరిచయం లేదు. ఆ తర్వాత వారు చెలరేగిపోయారు. అసలు మోడీ ఢిల్లీలో ఉంటారు. ఏపీకి మేమే మోడీలం అన్నట్లుగా వ్యవహరించారు. మరి వీరందరికీ ప్రజాబలం ఉందా… అనేదానిపై… చాలా మందికి అనుమానాలున్నాయి. వీరందరూ ఎన్నికల్లో నిలబడి.. తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకుంటేనే.. విలువ పెరుగుతుంది. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. కానీ వీరంతా.. ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అనేదే అందరిలోనూ వస్తున్న డౌట్. పోటీ పడి .. పరువు పోగొట్టుకోవడం కంటే… దూరంగా ఉండటం మంచిదని ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. మరి హైకమాండ్ ఈ పెద్ద నేతల్ని దూరంగా ఉంచుతుందా..?. పోటీ చేయమని ఆదేశిస్తుందా..?