అందరూ ఏదో అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇంకేదో అనుకుంది. ఏప్రియల్ 30న ఆంధ్రనాట పొలింగ్ వుంటుందని ఎందుకో ఓ ఫీలర్ వచ్చేసింది. దాన్నే అందరూ టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. దాని ప్రకారమే సమ్మర్ సినిమాలు అన్నీ ప్లాన్ చేసుకున్నారు. ప్రచారం పీక్స్ లో వుంటుందనే మహర్షిని మే లోకి జరిపారు. ఇలా ప్రతి సినిమా డేట్ లు రకరకాలుగా ప్లాన్ చేసుకున్నాయి.
తీరా చేస్తే, ఇప్పుడు ఏప్రియల్ 11తో ఎన్నికల వ్యవహారం ఖతమ్. మళ్లీ ఎప్పుడో మే నెలాఖరున ఫలితాల హడావుడి. నాగ్ చైతన్య మజిలీ సినిమా పీక్ ప్రచారం టైమ్ లో చిక్కుకుంది. ఎలా వుంటుందో చూడాలి. అదృష్టం మాత్రం చిత్రలహరి సినిమాదే.
జనాల దగ్గర డబ్బులు వుంటాయి. ఎన్నికలు అయిపోయి జనాలు ఖాళీ, పరీక్షలు అయిపోయి ఫ్యామిలీలు ఖాళీ. ఇలాంటి టైమ్ లో సరిగ్గా ఏప్రియల్ 12న వస్తోంది ఆ సినిమా. ఇన్నాళ్లకు సాయి ధరమ్ తేజ్ కు అదృష్టం కలిసి వస్తోందేమో?