వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు జరిగిన చేరికల్లో .. ఎక్కువగా.. పీకే సర్వేలు చూపించి… మైండ్ గేమ్ ఆడి చేర్చుకున్నవే. తెర వెనుక చాలా శక్తులు.. వైసీపీలోకి నేతల్ని పంపించేందుకు ప్రయత్నించాయనే ప్రచారం జరిగింది. చివరికి.. వారిలో చాలా మందికి టిక్కెట్లు దక్కలేదు. వీరిలో ముఖ్యుడు.. దాడి వీరభద్రరావు. గతంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి… కుదరకపోవడంతో.. వైసీపీలో చేరిన ఆయనకు… అనకాపల్లి ఎంపీ లేదా… అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఏదో ఓ టిక్కెట్ ఇవ్వకపోతే.. ఆయనకు వైసీపీలో చేరాల్సిన అవసరం లేదని చెప్పుకున్నారు. అయితే.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో.. దాడి వీరభద్రరావు కానీ.. ఆయన కుమారుల పేర్లు కానీ కనిపించలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆహ్వానించినా ఆ పార్టీలో చేరలేదు. కానీ.. తను విమర్శించి బయటకు వచ్చిన పార్టీలోకే మళ్లీ చేరారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా.. హ్యాండ్ ఇచ్చింది. ఇక.. అమలాపురం టిక్కెట్ ఇవ్వడం లేదని.. టీడీపీ హైకమాండ్ నుంచి క్లారిటీ రావడంతో…. వైసీపీలో చేరిపోయిన ఎంపీ పండుల రవీంద్రబాబుకూ అదే తరహా పరిస్థితి ఎదురయింది. ఆయనకు… అమలాపురం పార్లమెంట్ లోనే కాదు… ఏ అసెంబ్లీ నియోజకవర్గంలనూ అవకాశం కల్పించలేదు. దాంతో ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఇక పాదయాత్ర సమయంలో… ప్రత్యేకంగా రాయబారం చేసుకుని.. టిక్కెట్ ఇస్తామని ప్రకటించి మరీ పార్టీలో చేర్చుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి.. చివరి క్షణంలో.. జగన్ హ్యాండిచ్చారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నా… చివరి క్షణంలో బొప్పన భవకుమార్ అనే నేతకు టిక్కెట్ ప్రకటించారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి.. ఎక్కడా అవకాశం కల్పించలేదు. ఎక్కడో ఓ చోట అవకాశం కల్పిస్తామని చెప్పినా… చివరికి హ్యాండిచ్చారు. ఇక టీడీపీలో టిక్కెట్ లేదని… తనకు కనీసం గుంటూరు జిల్లా మంగళగిరి లాంటి చేనేతవర్గం ఎక్కువగా ఉన్న చోట అయినా అవకాశం కల్పిస్తారేమోనని… బుట్టా రేణుక.. హడావుడిగా వైసీపీలో చేరారు. కానీ.. ఆమెకూ అవకాశం లేదు. ఇక అలీ, జయసుధ, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు లాంటి వాళ్లందరూ.. అప్పటికప్పుడు.. భారీగా చేరికలు అని చెప్పుకోవడానికే .. ఉపయోగపడ్డారు. చివరికి ఎలాంటి అవకాశం కల్పించలేదు.