బన్నీ తో డైరక్టర్ త్రివిక్రమ్ సినిమా ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పట్లో నోచుకుంటుందన్నదీ అనుమానంగానే వుంది. ఈ సినిమాకు భయంకరమైన స్టార్ కాస్ట్ వుంది. వీళ్లందరి డేట్ లు, అవైలబులిటీ వగైరా ముందు తెలుసుకోవాల్సి వుంది. సినిమాను తమిళ, మళయాల మార్కెట్ లలో కూడా కాస్త అమ్మి డబ్బులు చేసుకునే ఆలోచనలో వున్నారు.
అందుకే కోలీవుడ్ కు చెందిన సత్యరాజ్, మల్లూవుడ్ కు చెందిన జయరామ్ లను కూడా కీలకపాత్రలకు తీసుకుంటున్నారు. ఇక తెలుగు జనాలకు లెక్కేలేదట. వీళ్లందరి డేట్ లు కావాలి. కాంబినేషన్లు చూసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకుని అప్పుడు సెట్ మీదకు వెళ్తారట.
అన్నట్లు హీరోయిన్ కు తోడుగా మరో హీరోయిన్ కూడా వుందట. ఆ పాత్రకు తెలుగు అమ్మాయిని తీసుకోవాలని చూస్తున్నారు త్రివిక్రమ్. బహుశా అరవింద సమేతలో కనిపించిన ఈషా ను మళ్లీ తీసుకుంటారేమో? అయితే బన్నీ మాత్రం త్రివిక్రమ్ సినిమాకు జస్ట్ మూడు నెలలు గ్యాప్ ఇచ్చి, వేరే ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా మూడు నెలల్లో అయిపోతుందని అంత నమ్మకంగా వుందట బన్నీకి. చూడాలి మరేం అవుతుందో?