“తెలుగేదశం పార్టీ అక్రమాలపై.. సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేయండి. డబ్బుల పంపిణీపై ఎక్కడిక్కడ ఫిర్యాదు చేయండి..” అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా సభల్లో చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే అక్రమాలపై ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం ఈ యాప్ను రూపొందించింది. అక్రమాలపై ఫిర్యాదు చేయాలనడం బాగుంది కానీ.. ప్రతి టీడీపీ నేత ఇల్లు సోదాలు చేయాలని ఫిర్యాదులు చేయడమే అనూహ్యం. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు.. సీ విజిల్లో అదే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం అభ్యర్థి, బంధువులు పేర్లు, అడ్రస్సులు పెట్టి.. వారింట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ఓ కంప్లయింట్ పడేస్తున్నారు. ముందుగా మాట్లాడుకున్నారో లేక… యాధృచ్చికమో కానీ.. ఎలాంటి ఆధారాలు .. ఆ ఫిర్యాదుల్లో లేకపోయినా టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు సిద్ధమవుతున్నారు.
నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ… నారాయణ కాలేజీల అధినేత. ఆయన నివారం నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే ఉంటుంది. నిన్న ఐటీ అధికారులు ఒక్క సారిగా.. ఆ ఇంటితో పాటు మెడికల్ కాలేజీపై విరుచుకుపడ్డారు. మూడు గంటల పాటు హడావుడి చేశారు. మొత్తం వెదికారు. ఆనక తీరిగ్గా.. ఏమీ దొరకలేదని వెళ్లిపోయారు. నారాయణ ఇంట్లో వందల కోట్ల రూపాయల క్యాష్ ఉందని.. తమకు సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు వచ్చిందని.. వారు తీరిగ్గా చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు నారాయణ కాలేజీలో… రూ.వందల కోట్లు దాచిపెట్టినట్టు సీవిజిల్కు ఫిర్యాదు వచ్చిందంన్నారు. సీవిజిల్కు అందిన ఫిర్యాదులో నిజం లేదని నిర్థారించుకున్నారట.
టీడీపీ నేతలపై ఐటీ దాడులకు రంగం సిద్ధం చేస్తున్నారని.. ఎన్ని బెదిరిచినా భయపడబోమని.. చంద్రబాబు.. విజయనగరంలో వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే.. ఈ దాడులు జరగడంతో కలకలం రేగింది. సాధారణంగా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక మద్దతు లేకుండా చేయడానికి బీజేపీ చేసే టెక్నిక్ ఇదే. తమ పార్టీపై కానీ.. తమ పార్టీ మిత్రపక్షాలపై కానీ.. ఒక్క ఐటీ దాడి జరగదు. కానీ ప్రత్యర్థి పార్టీల నేతలపై.. మాత్రం… దాడులు చేయడానికి ఓ టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో అదే జరిగింది. ఏపీలోనూ అదే జరగబోతోందని చెబుతున్నారు. దానికి ఇప్పుడు గొప్ప అవకాశంగా “సీ విజిల్” యాప్ను ఉపయోగించుకుంటున్నారు.