ఆలు లేదు చూలు లేదు అన్న టైపులో వుంది డైరక్టర్ రమేష్ వర్మ వ్యవహారం. ఖాతాలో ఒక్క హిట్ లేదు. ఏళ్ల తరబడి సినిమా లేదు.అలాంటిది లక్కీగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేతిలోకి వచ్చింది. ఒక పక్క అది చేస్తూనే నితిన్ తో సినిమా అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. కానీ ఏమయింది నితిన్ కాస్తా ఒక్క ట్వీట్ తో గాలి తీసేసాడు.
రమేష్ వర్మ సినిమా సంగతి అస్సలు ప్రస్తావించకుండానే తాను చంద్రశేఖర్ యేలేటి సినిమా చేయబోతున్నా అంటూ ప్రకటించేసాడు. ఈ విషయమై నితిన్ సన్నిహిత వర్గాల బోగట్టా వేరుగా వుంది. రమేష్ వర్మ దగ్గర అయిదేళ్ల బట్టి ఒకే కథ వుందని, అదే బెల్లంకొండకు చెప్పారని, కానీ అది కాకుండా రాక్షసన్ రీమేక్ చేస్తున్నారని, ఇప్పడు అదే కథ పట్టుకుని నితిన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
నితిన్ చూద్దాం, చేద్దాం అనే సరికి, ఆయన మీద ప్రెషర్ పెంచాలని ఏకంగా అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఏమయింది. నితిన్ ఇప్పట్లో ఖాళీ లేడు అని తేలిపోయింది. వెంకీ కుడుముల భీష్మ, యేలేటి చంద్రశేఖర్, సూర్యప్రతాప్ ల సినిమాలు చేయాలి.
అయినా కోనేరు బ్యానర్ కు ఇదేం సరదానో? డబ్బులు వుండి కూడా సరైన డైరక్టర్ ను చూసుకోకుండా, రమేష్ వర్మనే పట్టుకుని ముందుకు వెళ్లడం, ఏ హీరో డేట్లు ఇస్తారని? రాక్షసన్ తరువాత తేలుతుంది అసలు వ్యవహరం అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.