తెలుగు మీడియా రంగాన్ని సాక్షి కొత్త పుంతలు తొక్కి స్తోంది. తమ యజమాని రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఎంత భయంకరంగా ఉపయోగించుకోవచ్చు అన్న దానిపై సాక్షి ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. అయితే తమ ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించడమే కాకుండా, తమకు వ్యతిరేకమైన అంశాలను దాచి పెట్టడం లో కూడా సాక్షి కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.
గత రెండు మూడు రోజులుగా జనసేన పార్టీ మీద, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయి ఉందంటూ తీవ్రమైన ఆరోపణలతో సాక్షి పత్రిక, ఛానల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు బంధువు ఎవరికో పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చాడు కాబట్టి టీడీపీ తో పవన్ కుమ్మక్కయినట్టే అంటూ, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల దూరపు బంధువులు ఎవరో జనసేన లో చేరితే ఇది వారి కుమ్మక్కుకు తాజా నిదర్శనం అంటూ కథనాలు రాస్తున్న సాక్షికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కు అయినట్లు అస్సలు అనిపించడం లేదు.
వివరాల్లోకి వెళితే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి పురందరేశ్వరి విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దూరపు బంధువులు ఎవరో జనసేన లో చేరితే నే అది ఆ రెండు పార్టీల మధ్య కుమ్మక్కు లా కనిపించిన సాక్షికి, భార్యాభర్తలు ఒకరు వైయస్ఆర్సీపీ నుండి , ఒకరు బీజేపీ నుండి పోటీ చేస్తుంటే మాత్రం అది వైఎస్సార్ సీపీ – బీజేపీ పార్టీల మధ్య కుమ్మక్కు లా అస్సలు కనిపించడం లేదు కదా అంటూ పాఠకులు వాపోతున్నారు.
సొంత పత్రికలను, సొంత టీవీ చానల్స్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కూడా సహజమైన పరిణామమే అంటూ ప్రజలు సర్దుకు పోయినప్పటికీ, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ జనసేన విషయంలో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం.. మరీ ఇంత అన్యాయమా అనిపించేలా ఉంది అంటూ జనసేన అభిమానులు వాపోతున్నారు.