ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు స్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. కానీ.. ఇతర పార్టీలు.. ఏపీ ప్రయోజనాల గురించి కాకుండా.. చంద్రబాబును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడేవారు ఉండకూడదన్నట్లుగా.. జగన్, మోడీ, కేసీఆర్ రాజకీయ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆస్తులు, కులాలు, వ్యక్తిగత ద్వేషాలతో.. ఏపీ ప్రజల కన్నును.. ఏపీ ప్రజల వేళ్లతోనే పొడిపించే ప్రయత్నం జరుగుతోంది.
బెదిరింపులకు “ఆంధ్రులు బాంచన్ .. కాల్మొక్త” అంటారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్టులు.. ఊహించని విధంగా బయటపడుతున్నాయి. అయితే ఏవీ నేరుగా ఉండకపోవడమే ఈ రిటర్న్ గిఫ్ట్‌ల ప్రత్యేకత. ఏపీ ప్రజల డేటా చోరీ అంటూ టీడీపీకి యాప్ సేవలు అందించే సాఫ్ట్ వేర్ కంపెనీని… దివాలా తీయించేసిన.. వైనం కూడా.. రిటర్న్ గిఫ్టేననని… విజయసాయిరెడ్డి… తనంతట తానుగా బయట పెట్టిన కుట్రల ప్లాన్‌తో రిటర్న్ గిఫ్టుల్లో రెడ్ హ్యాండెడ్‌గా అందరూ దొరికిపోయారు. ఆ తర్వాత కూడా.. ఆగలేదు. ఈ రిటర్న్ గిఫ్టులు అలా సాగుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులను బెదిరించడం దగ్గర్నుంచి గెలిచిన తర్వాత వైసీపీలోచేరేలా ప్రొత్సహించడం వరరకూ చాలా ప్లాన్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఇదంతా రాజకీయం.. ఇప్పుడు కొత్తగా.. వేరే రకమైన గిఫ్ట్ కూడా ఇస్తున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే… ఆంధ్రప్రదేశ్ అధికారుల్ని బెదిరించడం.
హైదరాబాద్‌లో ఇళ్లను కూలగొట్టి ఏపీ అధికారులను కూడా లొంగదీసుకుంటారా..?
కొద్ది రోజుల క్రితం.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ప్రశాసన్ నగర్లో.. ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఆ పిటిషన్ సారాంశం. కానీ.. జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా.. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ డీజీపీకి చెందిన ఇంటిపైనే పిటిషన్ వేసినట్లుగా ప్రచారం చేసింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే.. డీజీపీ ఇంటిని .. బుల్ డోజర్లతో సగం మేర కూలగొట్టించేసింది. నిజానికి ప్రశాసన్ నగర్ అనేది.. సివిల్ సర్వీస్ అధికారులు నివసించే కాలనీ. అక్కడ ఉన్న ఇళ్లలో దాదాపు అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉంటాయని చెబుతారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లోనూ అదే చెప్పారు. కానీ ఒక్క ఏపీ డీజీపీని మాత్రమే టార్గెట్ చేశారు. ఇది నేరుగా జరిగింది. కానీ.. ఇంకా కొంత మంది అధికారులకు ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. ఏపీలోకి వచ్చిన సివిల్ సర్వీస్, ఇతర ఉన్నతాధికారులు… వైసీపీకి అనుకూలంగా వ్యవహరించానే సూచనలతో.. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీ గురించి ఒక్క మాట మట్లాడని “ఆంధ్రాబాదీ”లు ఎన్నికల ముందు రచ్చ ఎందుకు..?
ఇది మాత్రమే కాదు.. కొత్తగా మోహన్ బాబు… ఏపీలో.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ఆందోళనకు దిగారు. ఐదేళ్ల నుంచి తన కాలేజీకి ఒక్క రూపాయి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని.. ఆరోపించారు. కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. కాసేపు రోడ్డుపై పండుకుని…ఆందోళన చేశారు. కానీ ప్రభుత్వం వెంటనే అసలు విషయాలు బయట పెట్టింది. మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్ధలకు ఇప్పటి వరకు రూ. 95 కోట్లు కేటాయించారు. ఆరు కోట్లు మినహా మొత్తం చెల్లించారు. ఆ ఆరు కోట్లు ఏడాది చివరికి చెల్లించాల్సినవి. ఈ విషయాలన్నింటినీ మోహన్‌బాబు దాచి పెట్టారు. కొద్ది రోజుల కిందట ఏపీ ప్రైవేటు కాలేజీలన్ని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ లేఖ రాశాయి. ఆ లేఖ సారాంశం.. పక్కాగా ఫీజు రీఎంబర్స్ బకాయిలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడం. కానీ మోహన్ బాబు మాత్రం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇరవై రోజుల్లో పోలింగ్ జరగనుండా…ఓ రకంగా ఆపద్ధర్మ ప్రభుత్వం అని తెలిసి కూడా.. రాజకీయ ఆందోళన చేశారు. ఇలా ఎందుకు చేశారంటే… నేరుగా.. మళ్లీ వెళ్లు తెలంగాణ వైపు వెళ్తున్నాయి. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, మంచు మనోజ్ స్నేహితులు. వారి ద్వారా కథ నడించిందని చెబుతున్నారు. మోహన్ బాబు చేసిన ఆరోపణలపై.. బహిరంగచర్చకు రావాలని… ప్రభుత్వం సవాల్ చేసినా… అటు వైపు నుంచి స్పందన లేదు.
మొత్తానికి ఏపీ ప్రజల కళ్లను.. ఏపీ ప్రజల వేళ్లతోనే పొడిపించేలా.. మహా కుట్ర జరుగుతోంది. ఈ విషయం ఏపీ ప్రజలకు అర్థమవుతుందా..? లేదా..?