నితిన్ ముందు దర్శకుల క్యూ ఉంది. కొన్ని కథల్ని ఆయన ఓకే చేసేశాడు కూడా. అయితే ఏది ముందు, ఏది వెనుక అనేది అర్థం కావడం లేదు. ‘ఛలో’ దర్శకుడు వేణు కుడుముల చాలా రోజుల నుంచి నితిన్ తో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. రష్మికని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా పట్టాలెక్కుతుందనుకుంటే – చంద్రశేఖర్ ఏలేటి సినిమా ఎనౌన్స్ చేసి షాకిచ్చాడు నితిన్. అప్పుడే ‘భీష్మ’ ఉంటుందా, లేదా? అనే డౌటు మొదలైంది. ఇప్పుడు ‘భీష్మ’కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓ పోస్టర్నీ విడుదల చేశారు. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న క్లారిటీ లేదు. చంద్రశేఖర్ ఏలేటి సినిమా పూర్తయిన తరవాతే ‘భీష్మ’ పట్టాలెక్కుతుందని సమాచారం. అంటే… వేణు మరో ఆరు నెలలైనా ఆగాల్సిందే.