పోలవరం ప్రాజెక్ట్ వల్ల.. భద్రాచలం మునిగిపోతుందని… ఆ ప్రాజెక్ట్ ప్రభావాన్ని అంచనా వేసే వరకు.. పోలవరాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో… తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు… కౌంటర్ ఇచ్చారు. అసలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దేనని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డిమాండ్‌తో ఒక్క సారిగా… రాజకీయ కలకలం ప్రారంభమయింది. నిజానికి 1956కి ముందు అంటే.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు… తెలంగాణ … విలీనం జరగక ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో.. భద్రాచలం భాగం. అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా.. 1956కి ముందు ఉన్న తెలంగాణ కావాలని.. అనేక సార్లు నినదించారు. దాని ప్రకారం చూసినా… భద్రాచలం మొత్తం.. ఏపీకే చెందుతుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. కేసీఆర్ చెబుతున్న అభ్యంతరాలకు సరైన కౌంటర్ రెడీ చేసుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఆ ఏడు ముంపుమండలాలు మాత్రమే కాదు.. భద్రాచలం కూడా.. 1959కి ముందు… ఆంధ్రప్రదేశ్వే. తెలంగాణ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు.. సరిహద్దుల్ని జిల్లాల వారీగా నిర్ణయించారు. కానీ ఖమ్మం జిల్లాలో భద్రాచలం సహా… ఆ ఏడు మండలాలూ… తెలంగాణ కాదు. 1959 తర్వాత ఖమ్మం జిల్లాలో విలీనం చేయడంతో.. అవి తెలంగాణలో భౌగోళికంగా ఉన్నట్లు వాడుకలోకి వచ్చాయి.
మొత్తానికి ఎన్నికల సమయంలో.. హాట్ టాపిక్ అవడానికి.. మరో అంశం… తెరపైకి వచ్చింది. అదే భద్రాద్రి రామయ్య. ఏపీకి చెందిన భూభాగాన్ని తెలంగాణలో కలిపేసుకున్నారన్న ప్రచారం… ఇప్పుడు ఓటర్లపై ప్రభావం చూపుతుంది. అన్నింటికంటే ముఖ్యం.. భద్రాద్రి రామయ్య.. ఆంధ్ర ఆస్తి అన్న సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్తే.. మరింత సెంటిమెంట్ పెరుగుతుంది. పోలవరంపై… కేసీఆర్ చేస్తున్న రాజకీయానికి… ఇదే సరైన కౌంటర్ అని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.