తెలుగులో తొలి ట్రయాలజీ రాబోతోంది. బాహుబలితో రెండు భాగాల సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు మూడు భాగాల సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు కృష్ణ చైతన్య. గతంలో నితిన్ తో ఓ సినిమా చేసారు ఆయన. మళ్లీ అదే హీరోతో, అదే శ్రేష్ఠ బ్యానర్ లో ఈ సినిమాను చేయబోతున్నారు.
సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ‘పవర్ పేట’ అన్నది టైటిల్. ఈ సినిమా నవంబర్ నుంచి పట్టాలెక్కుతుంది. ఈలోగా నితన్ ఒకటి రెండు కమిట్ మెంట్ లను ఫినిష్ చేస్తారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిపోయింది. జోనర్ ఏమిటి? మూడు భాగాలేమిటి? కాస్టింగ్? ఇతరత్రా వ్యవహారాలు త్వరలో బయటకు వస్తాయి.