మిసెస్ సూర్యకాంతం. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్వాణ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగి, నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాతో రెండో సారి గట్టి దెబ్బతిన్నారు. మను సినిమానే డిజాస్టర్ అనుకుంటే, మిసెస్ సూర్యకాంతం అంతకు మించి. సినిమా అంతా క్యూబ్ ఖర్చులు పెట్టుకుని మరీ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు అంతా గోడకు పెట్టిన సున్నం అయిపోతోంది.
ఇదిలా వుంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నిర్వాణ చాలా ఆశలు పెట్టుకుందట. ఎంత లెవెల్ ఆశలు అంటే, ఈ సినిమా హిట్ అయితే 13 కోట్లు పెట్టి మహర్షి సినిమా ఓవర్ సీస్ రైట్స్ కొనాలని పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నారట నిర్వాణ నిర్వాహకులు. మిసెస్ సూర్యకాంతం హిట్ అయితే మంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మహర్షి సినిమా కొనాలనుకున్నారట.
మొత్తానికే నీరుకార్చేసింది నీహారికి మిసెస్ సూర్యకాంతం. అయినా సినిమా నిర్మాణం అంటే సినిమాను కొని డిస్ట్రిబ్యూషన్ చేయడం అంత తేలిక కాదని ఎప్పుడు తెలుసుకుంటారో?