రాజమౌళి ఆర్ఆర్ఆర్ యూనిట్ అనుకున్నట్లుగానే అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లిపోయింది. అక్కడికి సమీపంలోని కొండల్లో షూటింగ్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి అనుకున్న కథ ప్రకారం ఎక్కువ నార్త్ లో జరుగుతుంది. అందుకే ఉత్తరభారతంలోని లైవ్ లోకేషన్లలోనే ఎక్కువ షూట్ వుంటుంది. అహ్మదాబాద్ తరువాత వెనక్కు వస్తుంది యూనిట్.
ఆ తరువాత మళ్లీ ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో షూట్ వుంటుంది. కోన్నాళ్ల క్రితం కలకత్తా అంటూ రాగ్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే పీక్ సమ్మర్ సీజన్ లో మాత్రం కొద్ది రోజుల గ్యాప్ ఇస్తారు. మిగిలిన రోజులు అన్నీ అవిశ్రాంతంగా షూటింగ్ జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదల తేదీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీట్ అవ్వాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ మరీ భారీ కథ కాదని, మరీ బాహుబలి మాదిరిగా ఎక్కువ సీన్లు, స్టార్ కాస్ట్ వుండదని, ఓ భారీ కమర్షియల్ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుందని తెలుస్తోంది.