ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలకు.. అసహనం కొద్దికొద్దిగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏపీ బాధ్యతలు తీసుకున్న జీవీఎల్ నరసింహారావు .. ఏసీ రూముల్లో కూర్చుని… టీడీపీని విమర్శిస్తున్నారు. ఆయన బీజేపీ నేత కాబట్టి… టీడీపీని విమర్శించినా అర్థం ఉంది. కానీ.. జనసేన అధినేతను కూడా.. విమర్శిస్తున్నారు. ఎందుకంటే… పవన్ కల్యాణ్.. మంగళగిరిలో ప్రచారం చేయడం లేదు. చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించడం లేదట. అలా విమర్శించనందుకు .. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్గా మారిపోయారని చెప్పుకొచ్చేశారు. . పెద బాబునే కాదు చిన బాబును కూడా పల్లెత్తు మాట అనడం లేదట. మంగళగిరి వైపు ఆయన కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదట. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు. పవన్ ఇటువంటి నాటకాలకు ఫుల్ స్టాప్ పెడితే ఆయనకే మంచిదని జీవీఎల్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్.. స్ట్రాటజీ గత ఏడాదిన్నరగా ఒక్కటే ఉంది. ఆయన వైసీపీతో పాటు.. టీడీపీని, బీజేపీని కూడా విమర్శిస్తున్నారు. బీజేపీ స్థాయి చాలా చిన్నది కాబట్టి.. ఆ పార్టీ జోలికి వెళ్లడం లేదు. అలా వెళ్లకపోవడంతో… టీడీపీ కూడా విమర్శలు గుప్పించింది. విభజన హామీలపై.. పవన్ ఎందుకు మాట్లాడటం లేదని.. ప్రశ్నిస్తున్నారు. ఇక.. వైసీపీ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నేతలు.. మాత్రం.. పవన్ కల్యాణ్ విమర్శలకు పెద్దగా రెస్పాండ్ అవడం లేదు. వైసీపీ.. జనసేన విషయంలో వ్యవహరిస్తున్న స్ట్రాటజీని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. జనసేన అభ్యర్థులు ప్రధాన పోటీ దారులుగా లేనిచోట… ఆ పార్టీ ఓట్లు తమకు పడేలా ప్లాన్ చేసుకుంటోంది.
ఇదే… బీజేపీ నేతలకు.. .వైసీపీ నేతలకు.. కడుపు మంటలా మారింది. రెండు పార్టీల నేతలు పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో… బీజేపీ, టీడీపీకి పవన్ మద్దతిచ్చారు. ఈ సారి సొంతంగా పోటీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను ఓ పావుగా వాడుకుని.. టీడీపీని దెబ్బకొట్టాలని… చూశారన్న ప్రచారం జరిగింది. అయితే.. వారికి పవన్ కల్యాణ్ లొంగకపోవడంతోనే… ఇలా విమర్శలు చేస్తున్నారని… గతంలో బీజేపీకి మద్దతిచ్చినప్పుడు… అంతా బాగుందా.. అని జనసేన వర్గాలు బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాయి.