పిల్లి పిల్లల్ని చంకన పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుంటుంది రాజశేఖర్ వ్యవహారం. జీవితతో కలసి దాదాపు ప్రతీ పార్టీలోకూ అడుగుపెట్టి వచ్చేశారు. ఏ పార్టీలోనూ ఈ జంటకు ఆదరణ దక్కలేదు. వైకాలోనూ కొంతకాలం ఉన్నారు. `నేను జీన్స్ వేసుకోవడం జగన్‌కి ఇష్టం లేదు.. అందుకే ఆపార్టీలో ఉండలేకపోయా` అంటూ రాజశేఖర్ కూడా కామెంట్లు చేశాడు. అయితే చివరికి మళ్లీ అదే జగన్ పార్టీలోకి చేరిపోయాడు రాజశేఖర్. ఈరోజు హైదరాబాద్‌లోని లోటస్ ఫాంట్లోజగన్ సమక్షంలో మరోసారి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ సినీ దంపతులు. జగన్ విజయానికి కృషి చేస్తామని.. రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఏ పార్టీలో చేరినా.. అక్కడ యేడాది కూడా కొనసాగని పోగ్రెస్ రిపోర్ట్ వీళ్లది. మరి ఇక్కడ ఎంత కాలం ఉంటారో చూడాలి. పరిస్థితులు ఏమైనా, వచ్చినవాళ్లు ఎలాంటివాళ్లైనా.. కండువా కప్పడం జగన్‌కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే.. సినిమావాళ్లు జగన్ ఆపీసు ముందు క్యూ కడుతున్నారు. ఈ సినీ గ్లామర్ ఎన్నికల వేళ ఏమాత్రం పనికొస్తుందో చూడాలి.