నిజామాబాద్ ఎంపీ స్థానంలో.. బ్యాలెట్లను ఉపయోగించాలనుకున్న ఎన్నికల సంఘం మనసు మార్చుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలనే వాడాలని నిర్ణయించుకుంది. ఈసీ తీరుపై పోటీలో ఉన్న రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మాత్రమే వినియోగించాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదంటున్నారు. నిమాజాబాద్లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు నామినేషన్లు ఖరారయ్యాయి. తొలుత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న ఎన్నికల అధికారులు.. ఆ తర్వాత ఈవీఎంలు వినియోగించాలని నిర్ణయించారు. ఇందు కోసం కొత్తగా.. ఈవీఎంలను తయారు చేయనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్లతోనే జరుగుతాయి. దాని కోసం ఈసీ గుర్తించిన ప్రింటర్లు ఉన్నారు. వారు… కావాల్సిన్ని బ్యాలెట్లు తయారు చేసి ఇవ్వగలరు. ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత హఠాత్తుగా.. ఈసీ బ్యాలెట్ల వినియోగం నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కనీసం.. ఒక్క స్థానంలో బ్యాలెట్లతో ఎన్నికలు జరిగినా… ఫలితాల విషయంలో… ఈవీఎంలపై అనుమనాలు తొలగిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కానీ.. ఈసీ మాత్రం… నిర్ణయం మార్చుకుంది. కారణం ఏదైనప్పటికీ.. బ్యాలెట్లతో ఓటింగ్ కోసం చూస్తున్న రాజకీయ పార్టీలకు.. నిజామాబాద్ ఎన్నికల తర్వాత తమ కార్యాచరణను రూపొందించుకోవాలనుకున్నాయి.
అసవరం అయితే వంద మందితో నామినేషన్లు వేసి.. మరీ.. బ్యాలెట్ ఓటింగ్ కోసం ప్రయత్నించాలనుకున్నారు. కానీ.. ఈసీ మాత్రం ఈవీఎంల వైపే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో… వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి కూడా ఈసీ సిద్ధపడటం లేదు. దీంతో ఒక్క బీజేపీ ఆ పార్టీ మిత్రపక్షాలు తప్ప… ఇంకెవరూ.. ఈసీ తీరుపై సంతృప్తిగా లేరు.