జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఒంటరి పోరాటం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు లేకపోవడంతో.. మిత్రపక్షాల అభ్యర్థుల బాధ్యత సహా.. మొత్తం 175 నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు తనపై పడ్డాయి. అయితే.. రోజుకు పది సభలు నిర్వహించినా… కవర్ చేయడం కష్టం కాబట్టి.. వీలైనంత వరకూ… గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. పవన్ కల్యాణ్ … ఒక్క పిలుపు ఇస్తే.. ప్రచారం కోసం.. వచ్చే స్టార్ క్యాంపెయినర్లు.. ఆయన ఇంట్లోనే చాలా మంది ఉన్నారు. చిరంజీవి రాక పోవచ్చు కానీ… చరణ్, అర్జున్ సహా.. అనేక మంది హీరోలున్నారు. మిగతా వారి సంగతి పక్కన పెట్టినా.. చరణ్, అర్జున్ లకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. ఎక్కడికి వెళ్లినా.. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తారు.
అలాంటి వారితో రోజుకు రెండు, మూడు, నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినా.. వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అదే సమయంలో నితిన్, నిఖిల్ లాంటి యువ హీరోలు.. పవన్ కల్యాణ్‌కు అభిమానులు. పవన్ పిలుపునిస్తే.. వచ్చి ప్రచారం చేస్తారు. చిరు కుటుంబ హీరోలందరూ.. చరణ్, అర్జున్ సహా… బాబాయ్ పిలవాలే కానీ… మరుక్షణం ప్రచారానికి వస్తామని గతంలోనే ప్రకటించారు. అంటే.. ఇప్పటికీ వారిని పవన్ కల్యాణ్ ఆహ్వానించలేదని అర్థం అవుతోంది. ప్రచార భారం తను ఒక్కరే భరిస్తున్నారు. మరో బ్రదర్ నాగబాబు ఉన్పన్పటికీ.. ఆయనకు ప్రత్యేకంగా స్టార్ ఇమేజ్ లేదు. క్రౌడ్ పుల్ చేయలేరు. మహా అయితే మీడియాకు ఇంటర్యూ ఇచ్చి… కాస్త ఘాటు మాటలతో వైరల్ అయ్యే ప్రయత్నం చేయగలరు. ఇప్పుడు ఆయన కూడా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో.. ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడానికే ఆయనకు తీరిక లేదు. ఇప్పుడు ప్రచారం హై లెవల్‌కు సాగింది. వచ్చే మంగళవారం వరకే.. అంటే ఎనిమిది రోజులు మాత్రమే ప్రచార గడువు ఉంది.
ఈ లోపే… ప్రజల్లో ఓ పాజిటివ్ వేవ్ తెచ్చుకోవాలంటే ప్రచారం హోరెత్తించాలి. ఎక్కడికక్కడ పోటెత్తేలా జనసమీకరణ చేసి.. ప్రజాభిమానం తన వైపు ఉందని నమ్మకం కలిగించాలి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ వరకూ సక్సెస్ అవుతున్నారు. ఆయన ఒక్కరూ ప్రచారం చేసినా మహా అయితే యాభై నియోజకవర్గాలను కవర్ చేయలరు. మిగతా వాటిని కవర్ చేయడానికైనా.. ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లను ఆహ్వానించాల్సి ఉంది. అయితే పవన్ కు ఎవర్నీ పిలిచే అలవాటు లేదంటున్నారు. మరి ఈ విషయంలో నాగబాబు అయినా చొరవ తీసుకుంటారా..?