ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ.. ఇరుపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార తెలుగుదేశం పై దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్లపై దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు తప్పనిసరిగా గెలుస్తారని భావిస్తున్న నియోజకవర్గాలను వైసిపి నేతలు ఎంపిక చేసునికి బూత్ కన్వినర్లకు బేరం పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 నియోజకవర్గాలను వైసీపీ ఎంచుకుంది. ఈ నియోజకవర్గాలకు ప్రశాంత్ కిషోర్ బృందం చేరుకుంది. తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, పోలింగ్ ఏజెంట్ల పై దృష్టి సారించింది. సమాచారం మొత్తం ముందుగానే వారి దగ్గర ఉండటంతో… పని సులువు అవుతోంది. నియోజకవర్గానికి 70 నుంచి 80 మంది యువకుల్ని పంపారు. వీరందరూ తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాలలో తిష్ట వేశారు. అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న వారిని గుర్తించి డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగరిలో ఇలాంటి వారే పోలీసులకు చిక్కారు.
తెలంగాణాలో టీఆర్ఎస్ కూడా దాదాపుగా ఇటువంటి వ్యూహాన్ని అమలు చేసింది. తొలుత ప్రత్యర్ధి వర్గం ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ ఓట్లు తొలగించాలనే వైసిపి ఎత్తుగడకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్లాన్ బి లో భాగంగా పోలింగ్ ఏజెంట్ల పై దృష్టి పెట్టింది. పోలింగ్ ఏజెంట్లకు ఒక్కొక్కరికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగుదేశం ఏజెంట్లుగానే వ్యవహరిస్తారు. మధ్యాహ్నం 3గంటల తరువాత సీన్ మారుతుంది. అప్పటి వరకు పోల్ కానీ, ఓట్లలో 25 నుంచి 40శాతం వరకు వైసిపి వాళ్లు వేసుకునే విధంగా అంగీకారం కుదుర్చుకుంటున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం ఏజెంట్లు నోరు మెదపరు. దీని వలన ఒక్కో నియోజకవర్గంలో ఏడెనిమిది వేల ఓట్లు వైసిపికి గంపగుత్తగా పడిపోతాయి.
దీని వలన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయం సునాయాసం అవుతుందని ప్రశాంత్ కిషోర్ బృందం వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణాలో 25లక్షల ఓట్లను తొలగించడమే కాకుండా, ప్లాన్ బి లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కొనుగోలు చేయడం, సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ మరుసటి రోజు సాయంత్రం వరకు పోలింగ్ శాతం ఎంతో తెలియకపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఐదు గంటల తరువాత కూడా ఇవియం లలో టీఆర్ఎస్ అనుకూలంగా ఓట్లు వేశారని ప్రచారం జరిగింది.