దర్శకుడు సుకుమార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుంది. ఒకపక్క మహేష్ తో సినిమా డౌట్ లో పడింది. ఇంకోపక్క బన్నీ తో సినిమా ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. రంగస్థలం తరువాత మహేష్ స్క్రిప్ట్ చేసుకోవడం మాని, అసిస్టెంట్ లను డైరక్టర్లుగా పెట్టి, తన బ్యానర్ జాయింట్ చేసి సినిమాలు ప్లాన్ చేసారు. మూడు సినిమాలు ప్లాన్ చేస్తే, రెండు ఇప్పుడు డౌట్ లో పడ్డాయి. ఆల్ మోస్ట్ క్యాన్సిల్ స్టేజ్ లోకి వెళ్లాయి.
సూర్యప్రతాప్-నితిన్-గీతా కాంబినేషన్ లో సినిమా క్యాన్సిల్ అయింది. దాన్ని వేరే బ్యానర్ కు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే శౌర్య-శరత్ మరార్ కాంబినేషన్ లో మరో అసిస్టెంట్ తో సినిమా అనుకుంటే ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయినట్లు బోగట్టా.
మైత్రీమూవీస్ లో ప్లాన్ చేసిన సినిమా ఓక్కటే ప్రస్తుతానికి వుంది. కానీ అదీ వుంటుందో, ఊడుతుందో తెలియదు. మొత్తం మీద చూసుకుంటే తన బ్యానర్ చిన్న సినిమాల మీద దృష్టి పెట్టి, మహేష్ సినిమా స్క్రిప్ట్ ను లేటు చేసుకున్నారు. అలా అది పక్కకు వెళ్లింది. ఇప్పుడు ఇవీ. పాపం సుకుమార్.