తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… కాంగ్రెస్ పార్టీలో చేరి.. హడావుడి చేసిన … నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజేంద్రనగర్ లేదా జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం.. ఆయన చేయని ప్రయత్నం లేదు. అన్నీ చేసి.. చివరికి…ఏ టిక్కెట్టూ దక్కించుకోలేకపోయారు. అయినప్పటికీ..ఆయన ప్రచారం విషయంలో టీవీ చానళ్ల వద్ద హడావుడి చేశారు. కొన్ని విచిత్రమైన మేనరిజమ్స్‌తో… తెలంగాణ సర్కార్ పై సెటైర్లు వేశారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… కాంగ్రెస్ గెలవకపోతే… బ్లేడుతో కోసుకుంటానని సవాల్ చేశారు. అయితే కాంగ్రెస్ గెలవలేదు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఎవరూ పట్టించుకోలేదు కూడా..!
అయితే హఠాత్తుగా.. ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికార ప్రతినిధి హోదాకు .. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. తనకు అవకాశం కల్పించిన రాహుల్, ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఇక ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పేశారు. ఇంత హఠాత్తుగా.. ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నదానిపై.. ఆయన స్పందించడం లేదు కానీ.. కొద్ది రోజులుగా.. టాలీవుడ్ నటులపై ఉన్న రాజకీయ ఒత్తిడే కారణమన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్లో చిన్నా, చితకా నటులంతా… కొంత మంది ప్రొద్భలంతా… వైసీపీలో చేరుతున్నారు. వారిపై ఒత్తిడి ఉందని.. టాలీవుడ్లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
అలాంటి ఒత్తిడే.. బండ్ల గణేష్‌పై కూడా ఉందని… ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లో చేరకపోయినా పర్వాలేదు… కానీ కాంగ్రెస్‌లో ఉండకపోతే.. తనకు టెన్షన్లు ఉండవని.. బండ్ల భావించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయాల జోలికి వెళ్లకపోతే తనకే తిప్పలు ఉండవని అనుకున్నట్లుగా ఆయన ట్వీట్లు ఉన్నాయి. బండ్ల రాజకీయ జీవితం… అలా ప్రారంభమై.. అలా ముగిసిపోయింది. పవన్ కల్యాణ్ భక్తుడిగా ఆయన జనసేనలో యాక్టివ్ గా ఉండి ఉంటే… పవన్ ఏపీలో ఎక్కడో ఓ చోట టిక్కెట్ సర్దుబాటు చేసి ఉండేవారు. కానీ బండ్ల కాంగ్రెస్‌లో చేరి.. ఆ అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది.