మంచి పనులతో పొందలేని గౌరవాన్ని “భయం” తో పొందవచ్చు..!. డబ్బుతో కొనలేని ఓట్లను..”భయం”తో పొందవచ్చు..!. మంచి పనులు, డబ్బులతో అందని అధికారాన్ని “భయం”తో అందుకోవచ్చు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఇదే. జగనే ఈ వ్యూహాన్ని మొదటి నుంచి అమలు చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో… తానేంటో నిరూపించాలనుకున్న జగన్..” ముఖ్యమంత్రినే నిలబెట్టి కాల్చినా తప్పు లేదనే..” ప్రసంగం చేసి.. తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు. ఇప్పుడు.. ఆయన అనుచరులు.. ఎన్నికల్లో అదే బాటలో వెళ్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతల్ని ఏరి పారేస్తారా..?
ఎన్నికలను హింసాత్మకంగా చేసేందుకు వైసీపీ నేతుల ప్లాన్డ్ గా.. ఇలా.. సున్నితమైన నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. ఎన్నికలు సజావుగా సాగకూడదనే అజెండాను బయటకు తెస్తున్నారు. భద్రత పరంగా సున్నితమైన నియోజకవర్గాల్లో.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రకటలు చేస్తున్నారు. చంపుతాం, నరుకుతాం అంటూ చెలరేగిపోతున్నారు. మనుషులకు కనీస గౌరవం ఇవ్వని… ప్రత్యర్థి పార్టీలో ఉంటే.. వాళ్ల ప్రాణాలకు విలువే లేనట్లు మాట్లాడుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో.. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి… అత్యంత దారుణంగా మాట్లాడుతున్న వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యారు. ధర్మవరం ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం. టీడీపీ అభ్యర్థికి పట్టు ఉన్న గ్రామాల్లోకి వెళ్లి .. ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల సంగతి చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఎందుకీ హింసాత్మక కేకలు..!
అనంతపురం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం ఉరవకొండలోనూ… వైసీపీ అభ్యర్థులు అలాగే వ్యవహరిస్తున్నారు. ఆ నియోజకర్గం కూడా.. ఒకప్పుడు… హింసాత్మకంగా ఉండేది. కొంత కాలం నుంచి ప్రశాంతంగా ఉంది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు… ఎన్నికల ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఫ్యాక్షన్ అనేది తమకు వారసత్వం వచ్చిన ఆస్తి అన్నట్లుగా.. టీడీపీ నేతల అంతు చూడటం.. తమ వృత్తి అన్నట్లుగా చెలరేగిపోయి ప్రకటనలు చేస్తున్నారు. ఇరవై ఏళ్ల వరకూ ఓ లెక్క.. ఇప్పటి వరకూ ఓ లెక్క అంటూ సినిమా డైలాగులు చెప్పి..టీడీపీ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇక నెల్లూరు జిల్లా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దీ మరీ వివాదాస్పదమైన వ్యవహారం. జగన్ కునుసైగ చేస్తే ఎవరినైనా చంపేస్తామంటూ చెలరేగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం… విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తి దాడి జరిగినప్పుడు.. అల్లర్లు రేపడానికి ఈ ఎమ్మెల్యే ప్రయత్నించారు.
భయపెడితే ఏపీ ప్రజలు ఓట్లు వేసేస్తారా..?
వైసీపీ చోటా నేతలు చేసే హడావుడి.. రోజూ.. హైలెట్ అవుతూనే ఉంది. ఓ చోట వృద్ధుల్ని కొడతారు.. మరో చోట ర్యాలీకి అడ్డొచ్చారని.. స్కూల్ ఆటోపై దాడి చేస్తారు.. మరో చోట గర్భిణిపైనా వికృతం చూపిస్తారు… ఇలా రోజూ… వైసీపీ నేతల ఆకృత్యాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రజలను భయపెట్టి గెలిచేద్దామనే… ఓ రకమైన దారుణమైన మైండ్ సెట్ తో… వైసీపీ నేతలు.. రాజకీయం చేస్తున్నారు. మేలు చేస్తామని చెప్పి ప్రజల మద్దతు పొందే ప్రయత్నాలు చేయాలి కానీ.. ఏమీ చేయకుండా… కేవలం భయ పెట్టి ఓట్లు వేయించుకుందామనే పులివెందులలో దశాబ్దాలుగా పాటిస్తున్న వ్యూహాన్ని జగన్.. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అమలు చేయాలనుకుంటున్నారు. కానీ భయంతో ప్రజలు ఓట్లేస్తారో.. ఓట్లతో తరిమికొడతారో.. ఫలితాల తర్వాత వైసీపీకే తెలుస్తుంది.