ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్… వంద శాతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీటీవీకి చెందిన ప్రముఖ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్యూలో… పవన్ కల్యాణ్ .. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ సారి ఎవరి పల్లకీ మోయడానికి సిద్ధంగా లేమని.. కచ్చితంగా.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి తీరుతామనే ధీమాను.. పవన్ వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రభావంపై.. తన అంతరంగాన్ని ఎన్డీటీవీ ముందు ఆవిష్కరించారు. రాజ్యాంగ హక్కులను కాపాడటమే తన పార్టీ ప్రాథమిక విధి అని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్… ఆ విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తనకు లెఫ్ట్ వింగ్ భావజాలం ఉందని.. తాను కమ్యూనిస్టు భావాలను ఇష్టపడతానని.. పదే పదే చెప్పేవారు. ఇంటర్యూలో మాత్రం.. తాను.. లెఫ్ట్ వింగ్ కానీ.. రైట్ వింగ్ ను సమర్థించని.. తాను మధ్యస్థంగా ఉంటానని ప్రకటించారు.
ప్రజలకు మేలు చేసేదే.. తన భావజాలం అన్నట్లుగా… పవన్ కల్యాణ్ వివరించారు. ప్రజలకు మేలు చేస్తారని.. మోడీకి మద్దతిస్తే.. ఆయన భయపెట్టి పాలన చేస్తున్నారని మండి పడ్డారు. పాలన విషయంలో.. తన అలోచలను కూడా.. ప్రజల ముందు స్పష్టంగా ఉంటారు. ప్రజలు ఎవరూ ఉచితాలు… కోరుకోవడం లేదని.. పాతిక కేజీల బియ్యం కాదని.. పాతికేళ్ల భవిష్యత్ కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఉచిత పథకాలు, డబ్బుల పంపకాలు.. ఓట్లు రాలుస్తాయని తాను అనుకోవడం కుండబద్దలు కొట్టారు. సంక్షేమం పేరుతో.. తమకు నగదు చేసిన వారికే ప్రజలు ఓట్లేయరనేది.. పవన్ కల్యాణ్ భావన. అయితే.. పవన్ కల్యాణ్… ఉచిత, సంక్షేమ పథకాలపై ఇలా మీడియాతో మాట్లాడుతున్నా.. వాస్తవానికి మాత్రం.. ప్రధాన పార్టీలతో పోటీ పడి సంక్షేమ పథకాలను ప్రకటించారు. రైతులకు పెన్షన్ దగ్గర్నుంచి ఉచిత సిలిండర్ల వరకూ.. జనసేన మేనిఫెస్టోలో ఎన్నో హామీలున్నాయి. అయితే మీడియా ఇంటర్యూల్లో మాత్రం భిన్నంగా.. మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలకన్నా.. భవిష్యత్ నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు.
ఈ సారి ఎవరికీ మద్దతిచ్చే అవకాశం లేదని.. తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను పవన్ కల్యాణ్ ఇంటర్యూలో వ్యక్తం చేశారు. అయితే.. కొన్ని జిల్లాలపైనే ఫోకస్ చేస్తున్నారు కదా.. ఎలా సాధ్యమని… ఎన్డీటీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు… స్ట్రాంగ్‌గానే సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. అలాంటి విమర్శలన్నీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తూంటారని.. తాను అన్ని జిల్లాలపై ఒకే రంగా దృష్టి పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో… పవన్… తన పార్టీ ఉద్దేశాలనూ స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నారు.