జనాలు సినిమాల కోసం మొహం వాచిపోయి వున్నారు. పరీక్షలు అయిపోయాయి. సెలవుల సీజన్ వచ్చేసింది. టీవీ పెడితే ఎన్నికల గోల తప్ప మరోటి లేదు. ఇలాంటి టైమ్ లో వచ్చింది మజిలీ. అలా అని చిన్న సినిమా కాదు. సమంత, చైతూ కాంబినేషన్. శివనిర్వాణ డైరక్టర్. ఇంక చాలదా ఆసక్తికి. అందుకే జనాలు థియేటర్ల దగ్గర బారులు తీరేసారు.
తొలిరోజు ఎక్కడ చూసినా ఫుల్ అన్న మాట తప్ప, మరో మాట లేదు. పైగా ఈ ట్రెండ్ చూసి, బయ్యర్లు అర్జంట్ గా మాట్నీలకు, ఫస్ట్ షో లకు థియేటర్లు పెంచేసారు. పైగా థియేటర్లు ఖాళీగా రెడీగా వున్నాయి కూడా. దాంతో తొలిరోజు మంచి కలెక్షన్లు నమోదు చేసింది మజిలీ.
గుంటూరు ఫిక్స్ డ్ హయ్యర్లతో కలిపి 66 లక్షల వరకు వచ్చాయి. ఉత్తరాంధ్ర 76 లక్షల వరకు వచ్చాయి. మిగిలిన ఏరియాలు రావాల్సి వుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ వేళకు పక్కా బ్రేక్ ఈవెన్ అయ్యేలా వుంది. అంతకన్నా ముందే అవకాశం వుండేది కానీ, ఉగాది మార్నింగ్ షోలు డల్ వుంటాయని, అలాగే ఎన్నికల ముందు రోజులు జనాలు ఇళ్లలో వుండి అభ్యర్థులు పంపే తాయిలాల కోసం చూస్తుంటారని ఓ అంచనా.
అయినా అర్బన్ ఆడియన్స్ మాత్రం ఫుల్ గా థియేటర్ల దారిపడతారు. మొత్తం మీద నిర్మాత సాహు గారపాటికి కృష్ణార్జున యుద్దం మిగిల్చిన అసంతృప్తిని, మజిలీ పొగొట్టేసినట్లే.