ఆంధ్రప్రదేశ్‌కు.. మోడీ వచ్చి వెళ్లిన తర్వాత చాలా మంది అగ్రనేతలు వచ్చారు. పీయూష్ గోయాల్, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. వాళ్లు వచ్చారు. పోయారు. ఎవరికీ తెలియదు. సభలు ఏర్పాటు చేస్తే కనీస జనం లేరు. కానీ ఆయా సభల బిల్లులు మాత్రం.. అమిత్ షాకు షాకిచ్చాయట. మొన్న అమిత్ షా.. నర్సరావుపేటలో ఓ సభ… విశాఖలో రోడ్ షో నిర్వహించినందుకు అయిన ఖర్చును.. రూ. 80 లక్షలుగా చూపించేశారు. ఈ లెక్కలు చూసి.. కన్నా లక్ష్మినారాయణ వైపు.. అమిత్ షా… కాస్త గందరగోళంగా చుశారట.. ఆయన కోశాధికారివైపు చూపించారు. దాంతో.. కోశాధికారి పదవి ఊడిపోయింది. ఈయన విజయనగరం లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి కూడా. మరో వైపు కేంద్రంలో అధికార పార్టీ. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరనే పేరు ఉంది. దాంతో.. అనేక మంది అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు.. ఖర్చుల కోసం.. డబ్బులు కావాలంటూ.. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి ప్రారంభించారు. పరిస్థితి చూస్తే.. ఇప్పటికే యూపీ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేశారని.. అమిత్ షా… గొణుక్కుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మోడీ సభలకు.. వైసీపీ నేతలు ఎలాగోలా కార్యకర్తలను తరలించారు. కానీ ఇతర నేతలకు కూడా ఇలా సత్కారాలు చేయడం వారికి కూడా సాధ్యం కాదు. అందుకే.. అమిత్ షా సహా ఏ బీజేపీ నేత సభకూ… జనం కనిపించలేదు. అయితే బీజేపీ పెద్దలకు మాత్రం.. జీవీఎల్ లాంటి నేతలు … రాష్ట్రంలో పార్టీకి అమోఘమైన స్పందన ఉందని, చెబుతూ వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇటీవల కృష్ణాజిల్లా అవనిగడ్డకు వచ్చారు. పట్టుమని రెండు నుంచి మూడు వందల మంది కూడా లేరు. రెండు వేల ఖాళీ కుర్చీలకు రాజ్ నాధ్ సింగ్ ప్రసంగం చెప్పి వెళ్లిపోయారు. విజయవాడ వచ్చి మీడియాతో మాట్లాడాల్సి ఉన్నా… విజయవాడకు రాకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత అమిత్ షా నరసరావుపేట సభకు హాజరయ్యారు. అక్కడా ఖాళీ కుర్చీలే కనిపించాయి. ఆ తర్వాత ఆయన నేరుగా విశాఖపట్నం వెళ్లారు. అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి రోడ్ షో కు హాజరయ్యారు. పట్టుమని ఐదు వందల మందిని కూడా మొబిలైజ్ చేయలేకపోయారు. దాంతో ఆయన ప్రసంగించలేదు. కంచరపాలెం మిట్టలో ప్రసంగిస్తారని భావించినప్పటికీ జనం ఎవ్వరూ లేకపోవడంతో అమిత్ షా వెళ్లిపోయారు.
రైల్వేజోన్ ఇచ్చినా పరిస్థితి అలా ఉందేమిటని.. అమిత్ షా నేతల్ని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కోపంలో ఉండగానే.. బహిరంగసభల ఖర్చు బిల్లలకు సంతకాలు పెట్టాలని…ఆయనను.. పార్టీ నేతలు అడగడంతో… షాకు మండిపోయింది. అదీ కూడా… జనం లేని ఓ సభ… అదే జనం లేని.. రోడ్ షోలకు ఖర్చులు… రూ. దాదాపుగా కోటి చెబుతారా.. అని ఆశ్చర్యపోయిన ఆయన… కోశాధికారిని రాజీనామా చేయమని ఆదేశించారు. ఇక పోలింగ్ లోపు… ఏపీవైపు.. బీజేపీ నేతలు…చూసే అవకాశం లేదంటున్నారు.