శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర.. ఓ బస్సులో పోలీసులు రూ. ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా పెద్ద మొత్తంలో… నగదు స్వాధీనం చేసుకోవడం అరుదు. అది ఆర్టీసీ అద్దె బస్సు. పైగా.. డ్రైవర్ దగ్గర మాత్రమే తాళం ఉండే కేబిన్‌లో ఉన్నాయి. అంటే పకడ్బందీ వ్యూహంతోనే.. వాటిని తరలిస్తున్నారన్నమాట. మరి అంత పెద్ద మొత్తం బస్సులో తీసుకెళ్తున్న విషయం ఎవరికీ తెలియదట. చివరికి తాళం వేసిన డ్రైవర్‌కి… అలాగే.. బస్సులో ఉన్న ప్రయాణికీలకు కూడా తెలియదట. అందరూ మావి కాదంటే.,. మావి కాదని.. చెప్పేశారు. దాంతో.. పోలీసుల ప్రయాణికుల వివరాలను తీసుకుని పంపేశారట. ఆ ప్రయాణికుల్లో ఒకరు పాలవలస విక్రాంత్. పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి సోదరుడు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కీలక నేత పాలవలస రాజశేఖరం కుమారుడు.
వైఎస్ జగన్.. పాదయాత్రగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు… ఈ పాలవలస విక్రాంత్ వెయ్యి కార్లతో స్వాగతం పలికారు. ధూం.. ధాం.. చేశారు. కానీ.. ఆయన విశాఖ నుంచి రాజాంకు.. ఓ ఆర్టీసీ బస్సులో… వస్తున్నారు. జగన్ పాదాయాత్ర కోసం ఏర్పాటు చేసిన వెయ్యి కార్లలో ఒక్క దాన్నైనా ఆయన బుక్ చేసుకోలేకపోయారు. కానీ విచిత్రంగా.. ఆయన వస్తున్న బస్సులోనే రూ. ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయనకు తనకు తెలియదంటే.. తెలియదని.. తమ సొమ్ము కాదని.. చెప్పి పోలీసులకు ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు.
ఆ డబ్బు దొరికిన పరిస్థితి, అందులో ఉన్న వైసీపీ అభ్యర్థి తమ్ముడు.. ఇలా ఏ క్లూ చూసుకున్నా… అంత పెద్ద మొత్తంలో సొమ్ము.. పాలవలస కుటుంబానిదేనని తెలిసిపోతుంది. కానీ పోలీసులు… చాలా స్మార్ట్ గా వ్యవహరించి.. వారు తమ సొమ్ము కాదంటున్నారని చెబితే.. వివరాలు తీసుకుని వదిలేశారట. అదే.. తెలంగాణలో జయభేరీ సంస్థకు చెందిన సొమ్ము రూ. రెండు కోట్లు చిక్కితే.. ఎన్నికల్లో పంచడానికే తీసుకెళ్తున్నారని.. పోలీసులు నిర్ధారించేసుకుని ఏకంగా.. ఎంపీ మురళీమోహన్ మీదే కేసు పెట్టేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులకు.. ఇదే తేడానేమో..?