ఇంటర్మీడియట్లో ఫెయిలయ్యామని.. ఆత్మహత్య చేసుకున్న 23 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లన్నీ.. మళ్లీ ప్రత్యేకంగా.. రీ వాల్యూయేషన్, రీ వెరీఫికేషన్ చేశామని.. కానీ వారు… నిజంగానే ఫెయిలయ్యారని… ఇంటర్ బోర్డు అధికారి అశోక్ ప్రకటించారు. వారి ఆత్మహత్యలతో ఇంటర్ బోర్డుకు సంబంధం లేదని ఆయనకు ఆయన సొంతంగా క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. ఇంటర్ వ్యవహారాల్లో… తనకు మరక అంటకుండా… ఆయన పడుతున్న తాపత్రయం మొత్తం.. ఈ స్టేట్మెంట్లో కనిపిస్తోంది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో… పరీక్షల్లో జరిగిన అవకతవకల ప్రచారంలో.. ఆందోళనకు గురి కాని.., ఒక్క ఇంటర్ విద్యార్థి కూడా లేడంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాసిన వారిలో.. కనీసం… 30 శాతం మంది తమ ఎగ్జామినేషన్ పేపర్లు.. తమకు ఇవ్వాలని… దరఖాస్తు చేసుకున్నారంటనే… ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ తీరుపై.. విద్యార్థుల్లో ఏర్పడిన అనుమానాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో అర్థం అయిపోతుది.
ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరిగింది నిజం. 99 మార్కులు వచ్చిన విద్యార్థులకు.. సున్నా మార్కులేసింది నిజం. ఇప్పటికి కొన్ని వందల మందికి… అలా… మార్కుల్లో మార్పులు జరిగాయన్నది కూడా నిజమే. ఫెయిలయిన మూడు లక్షల మంది పై చిలుకు విద్యార్థుల్లో.. రీ వెరీఫికేషన్, రీ వాల్యూయేషన్లలో.. కనీసం మూడు శాతం మంది.. పాస్ అవుతున్నట్లుగా.. ఇంటర్ బోర్డు అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు… విద్యార్థుల ఆత్మహత్యలకు.. తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఎందుకు… అంతగా తాపత్రయ పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మానవహక్కుల సంఘాలకు.. ప్రతిపక్ష నేతలకు ఆత్మహత్యలపై సమాధానం ఇచ్చుకోవడానికి ఇంత కన్నా… గొప్ప దారి… ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు కనిపించినట్లుగా లేదు.
సమస్య.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఫెయిలవడం మాత్రమే కాదు. ఈ గందరగోళంతో.. వారి మనసుల్లో వచ్చిన ఆందోళనే.. అసలు సమస్య. ఇంటర్ బోర్డు నిర్వాకం విస్త్రతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత… ఫెయిలయిన వాళ్లలో ఏర్పడిన ఆవేదనతోనే… ఆత్మహత్యలు పెరిగాయి. దీనికి… ఇంటర్ బోర్డు నిర్వాకమే కారణం కానీ… విద్యార్థుల బలహీనత కాదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ… ఇలాంటి ఆత్మహత్యలు చోటు చేసుకోలేదు. మూడు రోజుల కిందట… సీబీఎస్ఈ ఫలితాలొచ్చాయి. కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదే..?. చేసింది తప్పు.. దాన్ని సమర్థించుకోవడానికి.. మరిన్ని తప్పులు చేస్తోంది ఇంటర్ బోర్డు..!