కథానాయిక నిధి అగర్వాల్ కి పాస్ పోర్టు కష్టాలొచ్చాయి. తన పాస్ పోర్టు ఇటీవలే పోయింది. దాంతో… `ఇస్మార్ట్ శంకర్` విడుదల వాయిదా పడింది. `ఇస్మార్ట్ శంకర్`కీ నిధి పాస్ పోర్ట్ కీ లింకు ఎక్కడుంది? అనుకుంటున్నారా? పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. టాకీ దాదాపు పూర్తి కావొచ్చింది. పాటల్ని యూరప్‌లో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. యూరప్ వెళ్లాలంటే పాస్ పోర్టు కావాలి కదా… ఆ పాస్ పోర్టు ఇప్పుడు పోయింది. ఈ విషయమై నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్త పాస్ పోర్టు రావడానికి టైమ్ పడుతుందని చెప్పార్ట. దాంతో.. యూరప్ షెడ్యూల్ గందరగోళంలో పడింది. మేలో ఈ సినిమాని విడుదల చేస్తానని పూరి ఇది వరకే చెప్పాడు. కానీ.. జూన్‌కి వాయిదా పడింది. ఇప్పుడు జూలై వరకూ ఈ సినిమా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. అయితే పూరి దగ్గర మరో ఆప్షన్ ఉంది. యూరప్‌తో తీయాల్సిన పాటల్ని హైదరాబాద్‌లో లాగించేయడం. ఇస్మార్ట్‌గా ఆలోచించి ఈ ఆప్షన్‌పై దృష్టి పెడితే ఇస్మార్ట్ శంకర్‌ని అనుకున్న సమయానికే పూర్తి చేసి విడుదల చేయొచ్చు. మరి పూరి ఏం చేస్తాడో చూడాలి.