వైసీపీ నెంబర్ టూ విజయసాయిరెడ్డి… టీడీపీపై ..రోజు వారీ విమర్శల బ్యాటింగ్… ను హాలీడే కూడా లేకుండా కొనసాగిస్తున్నారు. గతంలో చేసిన ఆరోపణల్నే కొత్తగా చేసేందుకు… లేఖల రూపంలో… బయటకు వదులుతున్నాు. గతంలో.. డీఎస్పీలను.. ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమించారంటూ.. ఆరోపణలు చేశారు. ఆ సమయంలో.. అటు పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి… ఇటు టీడీపీ నుంచి కూడా..సవాళ్లు ఎదురయ్యాయి. దమ్ముంటే పేర్లు బయట పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అయినా వైసీపీ నేతలు మాత్రం.. డొంక తిరుగుడుగా మాట్లాడుతూ.. అవే ఆరోపణల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. విజయసాయిరెడ్డి.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ ఆరోపణల్ని … మరో రేంజ్ కి తీసుకెళ్తున్నారు. మరో సారి నేరుగా.. గవర్నర్ కు లేఖ రాశారు.సామాజికవర్గమే ప్రాతిపదికన డీఎస్పీ పోస్టింగ్లు ఇచ్చారని …విచారణకు ఆదేశించాలని గవర్నర్ను విజయసాయిరెడ్డి కోరుతూ లేఖ పంపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పథకం ప్రకారమే 37 మంది డీఎస్పీలకు అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఓ సామాజికవర్గానికి మాత్రమే మేలు చేసేలా ఉన్నాయని.. వారిని ఎన్నికల్లో టీడీపీ మనుషులుగా వాడుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. సీనియారిటీని పాటించకుండా తన వారికి బాబు మార్క్ ప్రమోషన్లు ఇచ్చారని.. పదోన్నతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్స్ కూడా ఉల్లంఘించారని లేఖలో చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు ప్రాతిపదిక ఏమిటో కానీ.. ఆయన మాత్రం… ఈ విషయాన్ని అదే పనిగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని రోజలు క్రితం..విజయసాయిరెడ్డి ఓ లేఖ రాశారు. అప్పుడు గవర్నర్ ఏమని స్పందించారో కానీ… ఇప్పుడు మళ్లీ అదే టాపిక్ తో రాశారు. బహుశా.. అండర్ స్టాండింగ్తోనే ఈ తరహా లేఖలు రాస్తున్నారన్న అనుమానాలు… సహజంగానే రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి.
నిజానికి.. పోలీస్ డిపార్ట్మెంట్లో.. ఏ ఒక్కరికి పదోన్నతుల్లో అన్యాయం జరిగినా… కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. ఇంత వరకూ.. డీఎస్పీల ప్రమోషన్లలో తమకు అన్యాయం జరిగిందని.. ఒక్కరూ బయటకు రాలేదు. అంతే కాదు.. వైసీపీ ఆరోపిస్తున్నట్లు.. 37మంది డీఎస్పీల్లో ఇద్దరే.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారున్నారు.. ఆరుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారున్నారని.. లెక్కలు కూడా బయటకు వచ్చాయి. కానీ.. ఏదో టార్గెట్ పెట్టుకుని మాత్రమే.. విజయసాయిరెడ్డి.. ఆరోపణలు చేస్తున్నారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.