ఎన్నికల కోడ్ ఉన్నా సరే చంద్రబాబు… పోలవరం టూర్‌కి వెళ్లడానికి అసలు కారణం… హామీని నెరవేర్చలేకపోతున్నామని చెప్పడానికే. మేలో.. గ్రావిటీ ద్వారా నీళ్లివ్వబోతున్నామని.. గత ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కోసం.. పోలవరం పూర్తవబోతోందన్న నమ్మకాన్ని ప్రజల్లోకి వెళ్లడానికి అలా చేశారు. ఇప్పుడు.. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి… ఆ ప్రచారంలోని వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. చంద్రబాబు చెప్పినట్లు.. మేలో పోలవరం నుంచి నీళ్లు వస్తాయని ఎవరైనా ఎదురు చూస్తారేమో… వారి ఆశలు నెరవేరవని చెప్పేందుకు… చంద్రబాబు.. ప్లాన్ చేసుకుని మరీ పోలవరం పర్యటనకు వెళ్లారు. దానికి.. ఈసీని ధిక్కరిస్తున్నానని కలరింగ్ ఇచ్చారు. నిజానికి… కోడ్ కారణంగా.. ఎన్నికల విధులు ఉన్న ఎవరికీ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున… చంద్రబాబు పోలవరం టూర్‌పై సమాచారం వెళ్లలేదు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ను… చంద్రబాబే .. పోలవరం రావద్దని చెప్పారట.
పనులు ఎలా జరుగుతున్నాయో చెప్పే ఇంజినీర్లు ఉంటే చాలని సూచించడంతో.. ఈఎన్సీతో టూర్‌ని పూర్తి చేశారు. చంద్రబాబు తాను అనుకున్న టూర్‌ని పూర్తి చేసి చెప్పాలనుకున్నది.. చెప్పారు. ఈ ఏడాది పోలవరం నుంచి నీళ్లు రానే రావని.. ఆశలు పెట్టుకోవద్దని… 2020లో మాత్రం కచ్చితంగా పోలవరం నుంచి నీళ్లొస్తాయని.. చెప్పుకొచ్చారు. మరి గతంలో ఈ ఏడాది నుంచే నీళ్లిస్తామని చెప్పారు కదా.. అన్న విమర్శలు వస్తాయి కాబట్టి… దానికి కూడా.. ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్నికల కారణంగా… పనులు నమ్మెదించాయట. పర్యవేక్షణ లేని కారణంగా.. పనులు స్లో అయ్యాయంటున్నారు. అలాగే.. కేంద్రం నుచి రూ. ఐదు వేల కోట్ల రూపాయలకుపైగా బకాయిలు రావాల్సి ఉందని.. అది కూడా.. పనులు నెమ్మదవడానికి మరో కారణం అంటున్నారు.
పోలవరం పర్యటన వెనుక అసలు ఉద్దేశం… ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది పోలవరం నుంచి నీళ్లు రావని… క్లారిటీ ఇవ్వడానికే సీఎం టూర్‌కి వెళ్లారు. గ్రావిటీ ద్వారా కూడా.. నీళ్లు ఇచ్చేంతగా నిర్మాణం జరగలేదు. దాన్ని.. ఎలాగోలా కవర్ చేసుకోవడానికి… ఈ పర్యటన చేశారు. అనుకున్న సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. అదే సమయంలో రాజకీయంగా.. ఈసీ అడ్డంకులు సృష్టించినా.. తాను దూసుకెళ్తానని చెప్పుకునేందుకు ఈ టూర్‌ని వాడుకున్నారు.