దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత దిగువ స్థాయిలో ఉంది. ఆ విషయంలో పదే పదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో తేలిపోయింది. మొదట్లో… మీ అధికారులు మీకు తెలుసా.. అని ఈసీని సూటిగా సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో చురుకుపుట్టి.. కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కొంత మందిపై ఈసీ చర్యలు తీసుకుంది. కానీ.. మోడీ, షాలపై మాత్రం.. చర్యలు తీసుకోలేకపోయారు. వేచి చూసి.. చూసి.. క్లీన్ చిట్ ఇవ్వడం ప్రారంభించారు. దాంతో.. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లింది. కోడ్ ఉల్లంఘించినట్లు స్పష్టమైన ఆధారాలు చూపి.. ఈసీ వివక్ష చూపించిందని.. ఆరోపిస్తోంది. దీంతో.. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇప్పుడు.. వీవీ ప్యాట్ల లెక్కింపుపైనా అబద్దాలు చెప్పాలని.. మరోసారి 22 పార్టీలు కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. గతంలో ఇదే అంశంపై విచారణ జరిగిన సమయంలో 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కించడానికి కనీసం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం వాదించింది. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగినప్పుడే.. లెక్కింపునకు 24 గంటలకు మించి సమయం పట్టలేదని, ఇవీ బ్యాలెట్ తరహాలోనే లెక్కించాలి కాబట్టి పెద్దగా సమయం పట్టబోదని వాదించబోతున్నారు దీనిని టెక్నికల్‌గా నిరూపించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.
యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించాల్సిందేనని టీడీపీ సహా దేశంలోని 22 పార్టీలు కోరుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ సుప్రీం ఆదేశాలపైనా ఈ పార్టీలు సంతృప్తి చెందలేదు. సగం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనంటున్నాయి. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లుతుందని దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ వాదిస్తున్నాయి. ఓటు ఎవరికి వేశామో నిర్ధారించుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్లు ప్రవేశపెట్టారని.., ఆ స్లిప్పులు లెక్కించడం ద్వారా మరింత పారదర్శకత వస్తుందని వాదిస్తున్నాయి. ఈసీ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో.. దాన్నే… సుప్రీంకోర్టులో ప్రధాన సాక్ష్యంగా విపక్ష పార్టీలు ఉపయోగించుకోబోతున్నాయి.