ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి పూర్తి ఆధిక్యాన్ని ఇస్తాయని చెబుతున్నప్పటికీ.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడంలో.. చంద్రబాబు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత నిరాశాపూరిత వాతావరణం ఏర్పడింది. అయినా చంద్రబాబు లెక్క చేయడం లేదు. సోనియాతో భేటీ ముగిసిన తర్వాత ఆదివారం అమరావతి వచ్చిన చంద్రబాబు… మమతా బెనర్జీతో సమావేశానికి కోల్ కతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ కూడా.. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదు. బీజేపీకి … పాజిటివ్ వాతావరణం ఉందన్న పేరుతో..భారీ అక్రమాలకు తెర తీయబోతున్నారని మమతా బెనర్జీ నమ్ముతున్నారు. చంద్రబాబు కూడా.. అదే ఆలోచనలో ఉన్నారు.
ప్రాంతీయ పార్టీల నేతలు… ఎగ్జిట్ పోల్స్‌కు .. మనసు మార్చుకుని..బీజేపీతో సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు చేయకుండా.. ఉండేలా చంద్రబాబు..మరో పోరాట కార్యాచరణ ప్రారంభించారు. యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనంటూ.. అన్ని పార్టీలతో కలిసి.. ఆయన ఢిల్లీలోఇరవై ఒకటో తేదీన ధర్నా చేయబోతున్నారు. మామూలుగా అయితే.. ఇరవై ఒకటో తేదీన.. విపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేద్దామనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్… ఆ ప్రయత్నాన్ని కాస్త వెనుకడుగు వేసేలా చే్శాయి. మొదట..బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఢిల్లీకి వచ్చి సోనియా, రాహుల్‌లను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు.
మెజార్టీ ఎగ్జిట్ పోల్స్… బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు ప్రకటించినప్పటికీ.. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చినన్ని సీట్లు వస్తాయని చెప్పడం… చాలా మందికి నమ్మశక్యంగా లేదు. అందుకే.. ప్రాంతీయ పార్టీల నేతలు.. కాస్త మొండి ధైర్యంతో.. ముందుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే.. ఏదైనా ప్రస్తుతానికి అన్నీ.. తెర వెనుక చర్చలకే పరిమితం చేసి.. ఫలితాల తర్వాత… పరిస్థితిని బట్టి.. విపక్ష పార్టీలన్నీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకరు.. టచ్‌లో లేకపోతే… బీజేపీ.. ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి… చంద్రబాబు..ఆయా పార్టీలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు.