తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జాతీయ మీడియా చానళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు నుంచీ టీడీపీ అధినేత చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా అదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం 110 సీట్ల నుంచి ప్రారంభమవుతుందని.. అది 130 సీట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్లమెంట్ సీట్లు 18 నుంచి ఇరవై ఖాయమంటున్నారు. విశేషం ఏమిటంటే.. లగడపాటి సర్వే కంటే.. ఎక్కువే టీడీపీకి వస్తాయంటున్నారు.
మరోవైపు.. లగడపాటి సర్వేలో.. టీడీపీ 90 నుంచి 110 సీట్లు వరకు వస్తాయని చెప్పినప్పటికీ.. టీడీపీ నేతలు… అంగీకరించడం లేదు. అంత కంటే ఎక్కువే వస్తాయని… టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి.. తొడకొట్టి మరీ చెప్పారు. వైసీపీ ఓడిపోతుందని.. జగన్‌కు కూడా తెలుసని ఆయన చెబుతున్నారు. చాలా మంది టీడీపీ నేతల్లో… గెలుపుపై ధీమా ఉంది. ఎందుకంటే.. 2014లో … వైసీపీ గెలుస్తుందని.. ఏ సర్వేలు చెప్పాయో.. అవే సర్వేలు ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 2014లో టీడీపీ గెలుస్తుదని.. చెప్పిన సర్వేలే.. ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ కూడా.. టీడీపీ వైపే సర్వే ప్రకటించారు. 2014లోనూ ఆయన సర్వే ప్రకటించినప్పుడు.. అందరూ విమర్శలు చేశారు. కానీ ఆయన సర్వే నిజమయింది. ఇప్పుడు కూడా అలాగే విమర్శలు చేస్తున్నారని.. లగడపాటి సర్వేను నమ్ముతామని టీడీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ నేతల్లోనే టెన్షన్ ప్రారంభమయింది. తెలంగాణలో మహాకూటమి గెలుస్తుందనే మౌత్ టాక్ విపరీతంగా వచ్చింది. కానీ.. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇప్పుడు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందనే మౌత్ టాక్.. అంతే స్ప్రెడ్ అయింది. మరి ఫలితాలు ఎలా వస్తాయోనని… వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి జాతీయ మీడియా సర్వేల పేరుతో వారు ధైర్యం తెచ్చుకుంటున్నారు కానీ.. నంద్యాల సహా.. అనేక అనుభవాల రీత్యా… వారిలోనూ ఆందోళన ఉంది.