ఏపీఎన్నార్టీకి కొత్త చైర్మన్‌గా.. మేడపాటి వెంకటరెడ్డిని… ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీ ఎన్నార్టీ అంటే.. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగుసొసైటీ. ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం కోసం.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన నుంచి పుట్టిన సొసైటీ ఇంది. తుళ్లూరు మండలం రాయపూడి వద్ద ఏపీఎన్నార్టీ సౌసైటీ ఐకానిక్ టవర్ కూడా నిర్మాణం జరుగుతోంది. 33 అంతస్తులతో, 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ టవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సొసైటీకి.. వేమూరి రవి చైర్మన్‌గా ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైదొలిగారు. అమరావతి విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ఆసక్తిగా లేకపోవడంతో.. ఈ ఏపీఎన్నార్టీ సొసైటీని కూడా జగన్ లైట్ తీసుకుంటారని అనుకున్నారు. అయితే.. మేడపాటి వెంకటరెడ్డిని.. ఈ సొసైటీకి చైర్మన్‌గా నియమించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఎపీఎన్నార్టీని అత్యంత క్రియాశీలంగా ఉంచాలని.. చంద్రబాబు ప్రయత్నించారు. ఈ సొసైటీ ద్వారా.. ఇతర దేశాల్లోని తెలుగు వాళ్లు.. ఏపీలో సాఫ్ట్ వేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ప్రొత్సహించారు. అలాగే.. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రులకు.. సాయం చేసేందుకు కూడా.. ఈ సొసైటీ ప్రయత్నాలు చేసింది. దాదాపుగా తెలుగువాళ్లున్న ప్రతి చోటా.. ఈ సొసైటీ ద్వారా.. కార్యకలాపాలు జరిగేలా చూసుకున్నారు. అనతి కాలంలో ఈ సొసైటీకి మంచి నెట్ వర్క్ ఉండటంతో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీన్ని నిర్వీర్యం చేయడం కంటే.. ఉపయోగించుకుంటేనే మంచిదని భావించినట్లు ప్రచారం జరుగుతోంది.
వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారయింది. పదిహేడో తేదీన డెట్రాయిట్లో జరగనున్న తెలుగువారి సమ్మేళనంలో.. జగన్మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. మేడపాటి వెంకటరెడ్డిని ఏపీఎన్నార్టీ చైర్మన్‌గా నియమించడం వెనుక …ఈ పర్యటనను.. సక్సెస్ చేయాలన్న కారణమేనని భావిస్తున్నారు. సాధారణంగా.. విదేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బలప్రదర్శన చేస్తుంది. అలాంటి పరిస్థితిలేకుండా.. ఈ సారి.. జగన్మోహన్ రెడ్డికి.. అమెరికాలో చాలా క్రేజ్ ఉందని.. నిరూపించాలనే పట్టుదలగా.. టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నారు. ఈ టూర్‌ను సక్సెస్ చేసేలా.. మేడపాటి వెంకటరెడ్డికి…జగన్ మోహన్ రెడ్డికి జగన్ పదవి కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది.