సాహో విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడుగా జరుగుతున్నాయి. అయినా… అందరిలోనూ ఒకటే కంగారు. వీఎఫ్ఎక్స్తో ముడిపడిన సినిమా ఇది. పైగా మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ కు ఇప్పటికే `లాక్` వేసేశారు. అయితే సెకండాఫ్ ఎంతకీ తేలడం లేదు. సెకండాఫ్ నిడివి ఎక్కువైందన్నది చిత్రబృందం భయం. దాన్ని వీలైనంత తగ్గించి.. ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఆ విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. హిందీ డబ్బింగ్ ఇంకా మొదలు కావాల్సివుంది. మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశాక సెన్సార్‌కు పంపాలి. సాధారణంగా విడుదలకు నాలుగైదు రోజుల ముందు సెన్సార్‌ని పూర్తి చేస్తుంటారు. కానీ `సాహో` సెన్సార్‌ని మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఫైనల్ కాపీ రెడీ చేసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. వీలైతే సెన్సార్ ముందు రఫ్ కాపీ పంపించి, ఆ తరవాత వీఎఫ్ఎక్స్ కలుపుకుందామని భావిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ముంబై కేంద్రంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో సాహో టీమ్ అందుబాటులో లేకుండా పోయింది. దాంతో మీడియాకు ఒక్క ఫొటో విడుదల చేయడానికైనా ముంబై నుంచి అనుమతులు రావాల్సివస్తోంది. చిత్రబృందం మొత్తం ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్పైనే ఉండడంతో టాలీవుడ్లో చేయాల్సిన పబ్లిసిటీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.