ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను కోడెల కుటుంబం తిరస్కరించింది. ప్రభుత్వం ప్రమేయంతో.. పోలీసుల వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ కుటుంబం గట్టిగా నమ్ముతోంది. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇలాంటి సమయంలో అదే ప్రభుత్వం ఇచ్చే అధికార లాంఛనాల అంత్యక్రియలను ఎలా అంగీకరించాలని ఆ కుటుంబం ప్రశ్నిస్తోంది. అందుకే… పోలీసులు ఎవరూ.. అధికార లాంఛనాల కోసం రావొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అధికారిక లాంచనాలు తిరస్కరిస్తున్నామని స్పష్టమైన సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు.. అధికారిక లాంచనాలేమీ లేకుండానే ప్రజలు, అభిమానుల మధ్య కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.
గత మూడు నెలల కాలంలో పోలీసులు .. కోడెలతో అత్యంత దారుణంగా వ్యవహరించారన్న విషయం … టీడీపీ నేతలు బయట పెట్టారు. నర్సరావుపేట ఎమ్మెల్యే ఇంట్లోనే కేసులకు కుట్ర జరిగిందని… ఎక్కడెక్కడ ఎవరెవరు ఫిర్యాదు చేయాలో.. ఆయనే డిసైడ్ చేసి.. పంపించారని.. టీడీపీ నేతలు ఇప్పటికే లిస్ట్ విడుదల చేశారు. చిన్న చిన్న పెట్టీ కేసుల పెట్టి.. వాటినే.. పెద్ద పెద్ద కేసులుగా… పరువు తీసే విధంగా ప్రచారం చేయడంతో.. పరిస్థితి సీరియస్గా మారిపోయింది. స్థానిక పోలీసుల్ని, చివరికి డీజీపీని సంప్రదించినా.. తనకేమీ తెలియదని.. అంతా… విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారని చెప్పడం.. పోలీసులు అచేతన స్థితికి చేరిపోయారనేదానికి పరాకాష్ట అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల అధికార లాంఛనాలు అసలు వద్దని కోడెల కుటుంబం స్పష్టం చేసింది.
నర్సరావుపేటలో… కోడెల అంత్యక్రియలకు టీడీపీ నేతలే ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సరావుపేటతో… కోడెలకు సుదీర్గ అనుబంధం ఉంది. ఒకప్పుడు.. పెత్తందారి వ్యవస్థలో… ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో.. కోడెల ధైర్యంగా ముందడుగు వేసి… ప్రజలకు స్వేచ్చ అందించారు. ఆ తర్వాత పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయనకు ప్రజాభిమానం మెండుగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు అంత్యక్రియలకు తరలి వస్తారని భావిస్తున్నారు.