శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యంకాదనే వాదన వినిపిస్తోంది. కేంద్రం.. సాయంతో.. ఉభయసభల్లో.. మండలి రద్దు బిల్లును ఆమోదింప చేసుకున్న తర్వాతనే సాంకేతికంగా మండలి రద్దు అవుతుంది. అప్పటి వరకూ… మండలి ఉనికిలోనే ఉంటుంది. సెలక్ట్ కమిటీపని చేస్తుంది. ఇప్పటికే.. మండలి చైర్మన్ షరీఫ్… సెలక్ట్ కమిటీ సభ్యుల నియామక ప్రక్రియను ప్రారంభించారు. అది నాలుగు నెలలా.. ఐదు నెలలా అనేది చెప్పలేము. మండలిని కేంద్రం సాయంతో రద్దు చేసినా … జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల్ని ముందుకు తీసుకెళ్లగలరా.. అంటే… న్యాయపరమైన వివాదాల గురించి.. ప్రధానంగా చర్చ వస్తుంది.
ఎందుకంటే.. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాల్ని… తుంగలో తొక్కిన విషయం స్పష్టంగా ఉంది. రాజధాని తరలింపు నిర్ణయాలను కోర్టు అడ్డుకోలేకపోవచ్చు కానీ..రైతులకు పరిహారం ఇవ్వాలని మాత్రం ఆదేశించవచ్చు. రైతులతోచేసుకున్న ఒప్పందం ప్రకారం.. వారు ఇచ్చిన భూములకుప పరిహారం ఇవ్వాలంటే.. రెండు నుంచి నాలుగు లక్షలకోట్ల వరకూ అవుతుంది. అంత సొమ్ము ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే.. కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని సార్లు కోర్టు మెట్టికాయలు వేసినా.. తాను అనుకున్నది చేస్తూనే ఉన్నారు. అవి మధ్యలో ఆగిపోయినా ఆయన పట్టించుకోవడం లేదు.
పోలవరం సహా.. అన్నీ.. ఇలా త్రిశంకుస్వర్గంలో ఉండిపోయాయి. ఎలా చూసినా.. మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి…చట్టాలను.. రాజ్యాంగాల్ని ఉల్లంఘించి తరలించాలి తప్ప.. న్యాయపరంగా..చట్టబద్ధంగా తరలించడానికి సాధ్యం కాదంటున్నారు. అందుకే ఈ ఎపిసోడ్లో ..కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.