అమరావతి భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. కొన్ని లావాదేవీలను.. ఇన్‌కంట్యాక్స్ అధికారికి పంపి… అందులో అక్రమాలుంటే… చర్యలు తీసుకోండి… ఆధారాలుంటే మాకూ ఇవ్వండి..మేమూ చర్యలు తీసుకుంటామని.. విజ్ఞప్తి చేసుకున్నారు. సీఐడీ డీజీ రాసిన లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. దీన్ని చూసి న్యాయనిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్లు అక్రమం అని చెప్పడానికి ఒక్కటంటే.. ఒక్క ఆధారం కూడా.. సీఐడీ అధికారులు చూపించలేదంటున్నారు. నిజంగా.. అవే అక్రమం అయితే.. ముందుగా… రిజిస్ట్రేషన్లు చేసిన రిజిస్ట్రార్‌ను బాధ్యుడ్ని చేయాల్సి ఉంటుందంటున్నారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య… స్టాంప్ పేపర్ పై జరిగిన ఒప్పందం.. అక్రమం ఎలా అవుతుందన్న వాదనను లాయర్లు వినిపిస్తున్నారు. అదే సమయంలో.. రూ. రెండు లక్షల కంటే.. ఎక్కువ నగదుతో లావాదేవీలు జరిపినట్లుగా కూడా.. ఐటీ అధికారికి చెప్పారని… అది చట్ట విరుద్ధం అయితే.. రిజిస్ట్రార్ ఎలా .. అదే విషయాన్ని డాక్యుమెంట్లో చెప్పి మరీ రిజిస్టర్ చేస్తారని అంటున్నారు. సీఐడీ పోలీసులు ఎనిమిది నెలల పాటు.. అమరావతి భూముల వివరాల్ని పరిశోధించారు. ఆధారాలతో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు… ఆధారాలుంటే.. ఇవ్వండి అంటూ.. ఐటీ అధికారులకు లేఖ రాయడం.. సీఐడీ పోలీసుల తీరుపైనే అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోందంటున్నారు.
ఎవరైనా .. పన్ను కట్టని ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తి..ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుంది. అంత వరకూ.. ఆ శాఖ అధికారం. ఏపీ పోలీసులకు.. ఆధారాలు సేకరించి ఇవ్వడం కాదు. కానీ ఏపీ పోలీసులు అన్నీ తెలిసి కూడా.. ఎవరో చెప్పారని.. చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా.. వారంతా పోలీసు ఉన్నతాధికారులుగా ఎలా చెలామణి అవుతున్నారన్న విమర్శలు వస్తున్నా.. వారు భరించక తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.