టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును.. ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం.. ఏపీ అధికార వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేకుండా… హఠాత్తుగా.. ఇంటలిజెన్స్ పరికరాల కొనుగోలు వ్యవహారాలను తెరపైకి తెచ్చి.. సస్పెన్షన్ వేటు వేయడమే దీనికి కారణం. ఈ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలని… సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకెళ్లడానికి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుంటానన్నారు. ఏం చేస్తానో ముందు ముందు తెలుస్తుందని… ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఘటనలు తన మానసిక స్థితి మీద ప్రభావం చూపవని.. స్పష్టం చేశారు.
డీజీపీ ర్యాంక్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై.. ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదు. క్రమశిక్షణా చర్యలు… అవతవకలు… సర్వీస్ రూల్స్ వంటివి చూపించి సస్పెండ్ చేసింది. కేసులు పెట్టి ఉంటే.. ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లి ఉండేది. కానీ సర్వీసు తప్పులనే చూపించారు కాబట్టి.. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు… సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా ఏబీ వెంకటేశ్వరరావు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాను నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని..ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పట్ల.. ప్రభుత్వ వైఖరి ఇప్పటికే కక్ష పూరితంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. జాస్తి కృష్ణకిషోర్ విషయంలో క్యాట్.. ఇదేం కక్ష సాధింపు అనే ఆశ్చతర్యాన్ని కూడా వ్యక్తం చేసింది. ఆ కేసు క్యాట్‌లో విచారణ జరుగుతోంది. బహుశా.. ఏబీవీ కూడా… క్యాట్‌లో పిటిషన్ వేసుకోవచ్చు. కానీ అక్కడ అన్నీ తెలే సరికి చాలా కాలం పట్టొచ్చు. అప్పటికి ఆయన రిటైర్మెంట్ వస్తుందని అంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని.. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ సస్పెన్షన్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది.