తెలుగు మీడియాలో కరోనా వైరస్ సోకి ఓ రిపోర్టర్ మరణించారు. టీవీ5లో క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న మనోజ్ అనే జర్నలిస్టు.. వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురై.. చికిత్స పొందుతూ మరణించారు. ఇది తెలుగు జర్నలిస్టు సర్కిళ్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపుగా పదిహేనేళ్లుగా మనోజ్.. జర్నలిస్టుగా పని చేస్తన్నారు. మనోజ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని చాలా ఆలస్యంగా తెలిసింది. అయితే.. చనిపోయేంత తీవ్రంగా ఉందని మాత్రం గుర్తించలేకపోయారు. ఇతరత్రా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోయినా.. కరోనా తీవ్రమైన ప్రభావం చూపడంతో.. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇప్పటి వరకూ తెలుగు మీడియాలో పెద్దగా కరోనా కేసులు బయటపడలేదు. మూడు రోజుల కిందట.. సాక్షిలో ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో బయటపడిన మొదటి పాజిటివ్ కేసు అదే అనుకున్నారు. కానీ.. పలువురికి ఇది సోకిందని.టీవీ5 క్రైమ్ జర్నలిస్ట్ మృతితో భావిస్తున్నారు. కరోనా రిపోర్టింగ్‌లో జర్నలిస్టులు చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు వారంతా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.
ఢిల్లీలోనూ.. కొంత మంది తెలుగు జర్నలిస్టులకు.. వైరస్ సోకింది. అయితే.. వారందరూ చాలా వేగంగా కోలుకున్నారు. వైరస్.. యువకులు తట్టుకునేలా ఉంటుందని.. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వారికి ఇబ్బంది లేదని విశ్లేషణలు వస్తున్నాయి కానీ.. అది ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా.. మరణాలు సంభవిస్తున్నాయి. టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మరణం మాత్రం.. తెలుగు జర్నలిస్టు సర్కిళ్లను ఒక్క సారిగా షాక్‌కు గురి చేసిందని.