ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలనుకునే పట్టుదలను కొంచెం కూడా తగ్గించుకోలేదు. ఇప్పటికీ అంతర్గతంగా పనులు చురుకుగా సాగుతున్నాయని మరోసారి నిరూపితమయింది. జగన్మోహన్ రెడ్డి తరపున ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్న.. ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్… ఓ ప్రత్యేక బృందంతో.. విశాఖలో పర్యటించారు. ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. ప్రభుత్వానికి అవసరమైన భూములను.. ఆ బృందానికి చూపించారు. ఆ బృందం ప్రభుత్వ ఉద్యోగులు కాదు… ఆర్కిటెక్టులు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆర్కిటెక్టుల బృందాన్ని ప్రవీణ్ ప్రకాష్ పిలిపించి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అవసరమైన భవనాలకు అనుకూలమైన స్థలాలను ఎంపిక చేయించే ప్రక్రియ చేపట్టినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలించాలని నిర్ణయించారు. అయితే ఆయనకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. బిల్లులు శాసనమండలిలో పెండింగ్‌లో ఉన్నాయి. అదే సమయంలో హైకోర్టులోనూ పిటిషన్లు పడ్డాయి. దాంతో… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను తరలించడానికి సాధ్యపడలేదు. శాసనమండలిలో బిల్లులను క్లియర్ చేసుకునే వరకూ.. తరలించబోమని… హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. అయితే ఈ చిక్కులన్నీ అధిగమిస్తామన్న ఆశాభావంతో ఉన్న ప్రభుత్వం… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం సన్నాహాలు చేస్తోంది.
ప్రభుత్వానికి అవసరమైన భవనాలు.. అనువైన ప్రదేశంలో దొరకలేదని.. అందుకే.. సొంతంగా భవనాలు నిర్మించి.. నేరుగా అందులోకనే సీఎంవో.. సహా.. ఇతర కార్యాలయాల్ని తరలించాలనుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. అందుకే.. ఆర్కిటెక్టుల బృందాన్ని పిలిపించారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారాలన్నింటినీ కాస్త సీక్రెట్‌గానే నడుపుతోంది..ఏదీఅధికారికంగా చెప్పడం లేదు కాబట్టి.. ఈ వివరాలు… ఇప్పుడల్లా బయటకు తెలిసే అవకాశం లేదు.