రచయితగా పనిచేసి ఆ తరవాత మెగా ఫోన్ పట్టాడు కొరటాల శివ. దర్శకుడిగా కొరటాలకు ఓటమి అనేదే లేదు. ఎందుకంటే తన కథలు అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. కథలో సామాజిక అంశాల్ని ప్రస్తావిస్తూనే, దాన్ని కమర్షియల్ గా చెప్పడంలో చేయి తిరిగిపోయినోడు. తన కథలే తన విజయాలకు మూలం. తన దగ్గర పది కథలున్నాయి. వాటిలో 5 సినిమాలుగా తీసేశాడు. మరో 5 కథలున్నాయి. అందులో కామ్రేడ్ కథ ఒకటని తెలుస్తోంది. నక్సల్ బరీ ఉద్యమ నేపథ్యంలో ఈ కథ సాగబోతోందట. `ఆచార్య`లో చిరంజీవి నక్సలైట్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. `ఆచార్య`లో నక్సలిజం ఓ భాగం మాత్రమే. అదే సినిమా కాదు. కానీ.. కేవలం నక్సలిజంపైనే ఓ కథ రాసుకున్నాడట కొరటాల. దాన్ని కూడా ఓ పెద్ద హీరోతోనే చేయాలన్నది కొరటాల ప్లాన్. ఆచార్య తరవాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు కొరటాల శివ. ఆ తరవాతే… నక్సలైట్ కథని తెరకెక్కించే అవకాశం ఉంది.