నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరుహీరోయిన్లుంటారు. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఇద్దరినీ కొత్త వాళ్లనే తీసుకోవాలని చిత్రబృందం ముందే నిర్ణయించుకుంది. తొలి హీరోయిన్ గా మలయాళం నుంచి ప్రయాగ మార్టిన్ ని ఎంచుకున్నారు. రెండో హీరోయిన్ గా పూర్ణని తీసుకున్నట్టు టాక్.
పూర్ణని తెలుగు చిత్రసీమ మర్చిపోయి చాలా కాలం అయ్యింది. సినిమా అవకాశాల్లేక టీవీ షోలకు పరిమితమైపోయింది. అలాంటి పూర్ణకు బాలయ్య సినిమాలో ఛాన్స్ రావడం… ఆశ్చర్యకరమే. బాలయ్య నిర్ణయాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఫేడవుట్ అయిపోయి, అయిపోతున్నవాళ్లని ఆదరించడం, వాళ్లకు అవకాశాలు ఇవ్వడం బాలయ్య స్టైల్. కాకపోతే.. ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన కథానాయికలు రాణించిన దాఖలాలు కూడా లేవు. బాలయ్య సినిమా చేశానని తృప్తి పడిపోవడం మినహాయిస్తే.