కడప జిల్లాలో ఓ స్కార్పియో.. మరో ఎతియోస్.. వాహనం టిప్పర్‌ను ఢీకొని కాలిపోయాయి. స్కార్పియోలో ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు. గాయపడిన ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తం ఐదుగురు చనిపోయారు. కానీ అది సాదా సీదా రోడ్ యాక్సిడెంట్ కాదని అక్కడ సీన్ చూసిన పోలీసులకు అర్థమంది. రేసుల్లో పాల్గొంటూ.. ఛేజింగ్ చేసుకుటూ ప్రమాదానికి గురైతే.. ఎలా ఉంటుందో.. అచ్చగా అక్కడి సీన్ అలాగే ఉంది. మరి అలాంటిది అక్కడేం జరిగింది..? అరా తీస్తే.. సంచలన విషయాలు బయట పడ్డాయి. ఒకడు దొంగతనం చేస్తే.. ఆ దొంగ దగ్గర.. మొత్తం దోచుకోవాలని ఇంకో గజదొంగ ప్రయత్నించడం వల్ల జరిగిన ప్రమాదం అదని తేలింది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ ముఠా ఒకటైతే.. ఆ ముఠాను దెబ్బకొట్టి మొత్తం దోచుకోవాలనుకునే ముఠా మరొకటి పోటీ పడటంతో ఆ ప్రమాదం జరిగింది. గంధపు చెక్కలను అడవుల్లో కొట్టి తీసుకెళ్లడానికి తమిళనాడు నుంచి కడప జిల్లాలోలని అడవుల్లోకి ముఠాలు వస్తూంటాయి. గత ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. ఈ ప్రభుత్వంలో మళ్లీ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అలా ముఠాలు వస్తున్న విషయం లోకల్ గ్యాంగ్‌లకు .. అంటే.. కడప జిల్లాలోని గ్యాంగ్‌లకు సమాచారం వస్తూ ఉంటుంది. అక్కడి గ్యాంగ్‌లు.. అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం కొట్టడం కన్నా.. అలా తమిళనాడు నుంచి వచ్చి కొట్టుకుపోయే వారి దగ్గర కొట్టేస్తే.. పని సులువు అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో అలా కొంత మంది తమిళ స్మగ్లర్ల దగ్గర దుంగల్ని కొట్టేశారు కూడా. ఇలా.. ఓ తమిళ ముఠా అడవుల్లోకి వెళ్లి దుంగల్ని తీసుకొస్తోందని.. సమాచారం వచ్చింది. వారు కాపు కాశారు.
వల్లూరు మండలం గోటూరు దగ్గర స్మగ్లర్ల వాహనాన్ని కడప జిల్లాకు చెందిన దోపిడీ గ్యాంగ్ గుర్తించి వెంబడించడం ప్రారంభించింది. ఈ దోపిడీ గ్యాంగ్ ల గురించి బాగా తెలిసిన తమిళ స్మగ్లర్లు.. వారికి దొరక్కుండా వేగంగా వెళ్లడం ప్రారంభించారు. ఇక్కడే ఛేజింగ్ ప్రారంభమయింది. రెండు వాహనాల్లోని డ్రైవర్లు శరవేగంగా ఒకరినొకరు చేజింగ్ చేసుకుంటూ వెళ్తూ టిప్పర్‌ను ఢీకొన్నారు. నేరుగా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో మంటలు చేలరేగాయి. నలుగురు తమిళ స్మగ్లర్లు సజీవనదహనమయ్యారు. గాయపడిన వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు ఈ విషయాలపై నిర్ధారణకు వచ్చారు.
గత ప్రభుత్వంలో ప్రతీ రోజు.. స్మగ్లర్లు అరెస్ట్ అనే వార్త కనిపించేది. ఇతర దేశాల నుంచి కొల్లం గంగిరెడ్డి లాంటి వారిని పట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భంలో తమిళ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని ఎన్ కౌంటర్ కూడా చేశారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది.. కానీ ఒక్కరంటే.. ఒక్కర్నీ పట్టుకోవడం లేదు. చివరికి దుంగల్ని కొట్టుకుపోయేవారిని దోచుకోవడానికి ముఠాలు కూడా తయారయ్యాయి.