పలాస తో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ని తెరకెక్కిస్తున్నాడు. సుధీర్ బాబు కథానాయకుడు. ఇటీవలే మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. పలాస లా ఇది కూడా 1980 నేపథ్యంలో సాగే కథే. లైటింగ్ సూరిబాబు గా.. సుధీర్ నటిస్తున్నాడు. మరి ఆ శ్రీదేవి ఎవరన్నదే తేలాలి. శ్రీదేవి పాత్ర కోసం ఓ కొత్తమ్మాయిని వెదికి పట్టుకునే పనిలో వుంది చిత్రబృందం. దర్శకుడైతే… ‘పలాస’లో నటించిన నక్షత్రని ఎంచుకోవాలని చూస్తున్నాడట. `పలాస`లో నక్షత్రకు మంచి మార్కులే పడ్డాయి. కాబట్టి.. సెంటిమెంట్ గా ఆ కథానాయికని మళ్లీ తీసుకోవాలని భావిస్తున్నాడు కరుణ కుమార్ . దాదాపుగా ఆ అమ్మాయే కథానాయికగా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈనెలాఖరున షూటింగ్ మొదలెడతారు. ఈలోగా కథానాయిక ఎంపికపై ఓ స్పష్టత వస్తుంది.