వ్యవసాయేతర ఆస్తుల నమోదును ధరణి పోర్టల్‌లో అప్ లోడ్ చేయడంపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్‌లో వ్యక్తిగత ఆస్తుల వివరాలు ఉంచడం.. మార్పులు చేర్పులు చేయడానికి అవకాాశం ఉన్నందు వల్ల ఆస్తులకు రక్షణ ఉండదంటూ.. కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధరణిపోర్టల్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాల నమోదుపై స్టే విధించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఫ్లేస్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో 4 యాప్స్ ఉన్నాయని.. అసలు యాప్ ఏదో తెలుసుకోవడం ఇబ్బందని హైకోర్టు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. యాప్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలన్న ..రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శం అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లోకి అప్ లోడ్ చేసి. .. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు.
రెండు, మూడు వారాల్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కూడా పూర్తి చేసి.. రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలనుకున్నారు. మామూలగా అయితే ఈ పాటికి… అందుబాటులోకి రావాల్సింది. వర్షాల కారణంగా నిలుపుదల చేస్తూ నిర్ణఁయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలనుకున్నా.. హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే గడువుపై ఉత్కంఠ ప్రారంభమయింది.