మిత్రులుగా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. తప్పులు కూడా ఒప్పులైపోతాయి. పొరపొచ్చాలు వస్తే మాత్రం.. ఒప్పులు తప్పులుగా.. మారి తిప్పలు పెడుతుంటాయి. అమలాపాల్ విషయంలో ఇదే జరుగుతోంది. అమలాపాల్ తన మాజీ ప్రియుడు భవిందర్ సింగ్ పై ఇప్పుడు కోర్టులో కేసు వేసింది.
విషయం ఏమిటంటే… అమలాపాల్ .. గాయకుడు భవిందర్ సింగ్ ఇద్దరూ గతంలో క్లోజ్ గా ఉండేవారు. ఇద్దరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తోందని కూడా అనుకున్నారంతా. ఓ సందర్భంగా భవీందర్ సింగ్ తన ఇన్స్ట్రాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో భవీందర్, అమలాపాల్ పెళ్లి దుస్తుల్లో ఉండడం చూసి.. అంతా షాక్ తిన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ ప్రచారం మొదలైంది. వెంటనే.. భవిందర్ ఆ ఫొటోల్ని ఇన్స్ట్రాలోంచి తొలగించాడు. ఇది జరిగి చాలా కాలం అయ్యింది.
అయితే తాజాగా ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. తన అనుమతి లేకుండా… తన ఫొటోల్ని ఇన్స్ట్రాలో పెట్టి, తప్పుడు సంకేతాలు పంపాడని, తన పరువుకి తీవ్ర నష్టం కలిగించాడని భవీందర్ పై కోర్టులో కేసు వేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ న్యాయస్థానం భవీందర్కు నోటీసులు కూడా పంపింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని అమలాపాల్ ఇప్పుడు బయటకు తీసుకొచ్చిందేమిటా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్ – భవీందర్ మధ్య విబేధాలు రావడంతో …వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని, అందుకే పాత విషయాల్ని తవ్వి… తన మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంటోందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి .. అమలాపాల్ ఏమంటుందో?