కొరటాల శివ సినిమాలు సీరియస్ టోన్ లో సాగిపోతుంటాయి. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను .. ఈ సినిమాల్లో సీరియస్ నెస్ తప్ప చెప్పుకోదగ్గ సరదా వుండదు. ఇప్పుడాయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. చిరంజీవి అంటే వినోదం నెక్స్ట్ లెవల్ వుండాలి. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ లోనే చాలా సరదా వుంటుంది. మెగా ఫన్ ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కొరటాల ముందు కూడా ఇదే ఛాలెంజ్ వుంది.
ఆచార్యలో కామెడీ ట్రాక్ ని సెట్ చేసే పనిలో వున్నారు కొరటాల. ముందుగా కొరటాల టీమ్ ఓ ట్రాక్ రెడీ చేసింది. ఇది పెద్దగా రక్తికట్టించలేదు. దీంతో మరో రచయిత శ్రీధర్ సీపానని ఆశ్రయించారు. ఆయన ఓ ట్రాక్ రెడీ చేశాడు. ఇదీ మెగాస్టార్ కి రుచించలేదు. ఇప్పుడు మరో రచయితని తెచ్చారు. ఆయనే బీవీఎస్ రవి. ఇప్పుడు ఆచార్య కోసం కామెడీ సృస్టించేపనిలో ఉన్నాడాయన. రవి కామెడీ మెగాస్టార్ ని ఇంప్రస్ చేస్తే ఓకే .. లేదంటే .. మరో రచయిత కూడా ఆచార్య టీమ్ లో చేరే అవకాశం వుంది.