పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం రోజువారీగా పెంచుతోంది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినప్పటికీ.. దేశంలో మాత్రం.. ధరలు అసాధారణంగా పెంచుకుంటూ పోతున్నారు. గత రెండు రోజుల్లో.. లీటర్‌పై అరవై పైసల వరకూ పెరిగింది. లాక్ డౌన్ తర్వాత నుంచి కేంద్రం… ఇప్పటి వరకూ ఇరవై రూపాయల వరకూ వడ్డించింది. ఇంకా ఎంత పిండుతుందో తెలియని పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 90 రూపాయలు దాటిపోయింది. ఏపీలో మద్యం అలవాటును తగ్గించడానికి.. మద్యం ధరలు పెంచినట్లుగా.. వాహన అలవాట్లను తగ్గించడానికి .. ఇలా ధరలు పెంచుతున్నారా అన్న చర్చను బీజేపీ అనుకూల మీడియా ప్రారంభింది.
ఎందుకంటే.. ఎలక్ట్రిన్ వాహనాల వైపు జనం మళ్లాలని.. ఇలా రేట్లు పెంచుతున్నారనే వాదనను తెరపైకి తేవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఇంటర్నేషనల్ ధరలు, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం ఇండియాలో ప్రతి రోజూ డీజిల్, పెట్రోల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మారుస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం.. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడల్లా పన్నులు పెంచుతోంది. ప్రస్తుతం లీటర ్పెట్రోల్ ధరలో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 55 వరకూ ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ ధర అంతకంతకూ పెంచుకుపోవడంతో.. ఏడాదికి కనీసం..మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క పెట్రోలియం ఉత్పత్తుల పై నుంచే వస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఇది రూ. 70వేల కోట్ల వరకే ఉండేది.
దీంతో.. కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయన్న కారణంగా… రేట్లు పెంచుతూనే ఉన్నారు కానీ.. ట్యాక్స్‌లు తగ్గించే ప్రయత్నం చేయడం లేదు. పైగా.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు .. పన్నులు బాదేస్తున్నామన్న కొత్త సంకేతాన్ని పంపుతున్నారు. వ్యతిరేకిస్తే దేశభక్తి లేదన్నట్లుగా కవరింగ్ ప్రారంభించే పరిస్థితి కూడా ఉండే అవకాశంఉంది.